- Advertisement -
పిఠాపురం నుంచే మొదలవుతోందా…
Starting from Pithapuram...
కాకినాడ, జనవరి 22, (వాయిస్ టుడే)
మొన్నటి సాధారణ ఎన్నికల నాటినుంచి స్పెషల్ ఫోకస్ ఉన్న నియోజకవర్గం కాకినాడ జిల్లాలోని పిఠాపురం. ఎందుకంటే ఇక్కడ నుంచే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భారీ మెజార్టీతో గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించారు.. పిఠాపురం నియోజకవర్గం ఫేమస్ కావడానికి కలగడానికి ఇది ఒక కారణమైతే.. నియోజకవర్గంలో మంచి పట్టున్న ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించి, అన్నీ తానై గెలుపులో కీలకంగా వ్యవహరించారు.ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ అర్హుడు, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గత కొన్ని రోజులుగా వస్తోన్న డిమాండ్‌తోపాటు సోషల్ మీడియాలో కూడా ఈ డిమాండ్ ఎక్కువ అయింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి మొట్టమొదటిగా వర్మ స్పందించారు. మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం తప్పేంటని ప్రశ్నిస్తూనే ఆయా పార్టీల కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీలకు ఉంటుందన్నారు.. మంత్రి లోకేష్‌కు డిప్యూటీ పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఎందుకు సరైనదేనో వివరిస్తూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. దీంతో వర్మ వ్యాఖ్యలకు ఒక్కసారిగా ప్రాధాన్యత లభించింది..పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న వర్మ తన సీటును త్యాగం చేసి ఇచ్చారన్న సానుభూతి నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా ఉంది.. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా అంతే సహకారం అందిస్తున్నారు.. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉన్న డిప్యూటీ సీఎం హోదా సరిసమానంగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రెస్‌మీట్ ద్వారా వర్మ చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ప్రతీ పార్టీకు వారి లెక్కలు వారికుంటాయి.. జగన్ ఓడిపోయినా ఆయన్ను ఆ పార్టీ కార్యకర్తలు సీఎం సీఎం అంటున్నారు.. జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌ను సీఎం సీఎం అంటున్నారు.. అంటే ఇక్కడ ఎవరి పార్టీ వారికి అభిమానం వారికి ఉన్నట్లు గుర్తించాలి..సరిగ్గా ఇలాగే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న కోరిక టీడీపీ శ్రేణులకు ఉంటుంది.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయడమంటే మరొకరిని తక్కువ చేయడం అని ఎందుకు అనుకోవాలని వర్మ ప్రశ్నించారు. పార్టీ మనుగడ, ధైర్యం కోసం లోకేష్‌ను మంచి హోదాలో చూడాలనుకోవడంలో తప్పులేదన్నారు. ఏ ప్రాంతీయ పార్టీకు లేని కోటి సభ్యత్వాలు కలిగిన పార్టీ టీడీపీ అన్నారు వర్మ. దీనికి ముఖ్య కారకుడు లోకేష్ అని, చాలా ప్రాంతాలనుంచి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. వాళ్లే కాదు తాను కూడా మద్దతు ఇస్తున్నానని, ఎందుకంటే టీడీపీ శకం ముగిసిందనే ప్రచారం నుంచి యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్లు నడిచి ప్రతీ కార్యకర్తలో జోష్ నింపిన ఘనత లోకేష్‌కే చెల్లుతుందన్నారు. దీనిపై ఎలాంటి వక్రభాష్యాలు, అపోహలకు పోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు వర్మ.. ఏదిఏమైనా పిఠాపురం నుంచే ఏపీ డిప్యూటీ సీఎం పదవివైపుగా లోకేష్ అడుగులు పడుతోందని ఉమ్మడి జిల్లాలోని టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు..
- Advertisement -