పదివేల మద్దతు ధరతో కందులను కొనుగోలు చేయాలి

- Advertisement -

పదివేల మద్దతు ధరతో కందులను కొనుగోలు చేయాలి

Stocks should be bought at a support price of ten thousand

*
ఎటువంటి షరతులు లేకుండా పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి.

* వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్

తుగ్గలి
పదివేల రూపాయలతో రైతులు పండించిన కందులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్ తెలియజేశారు.మండల కేంద్రమైన తుగ్గలి నందు సోమవారం రోజున కంది కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధరను 10వేలకు పెంచి ఎటువంటి షరతులు లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు ముందుండి ఆదుకోవాలని ఆయన తెలియజేశారు.సభాముఖంగా అందరూ తీర్మానం చేసి సంబంధిత అధికారులైన జిల్లా కలెక్టర్ కు,వ్యవసాయ శాఖ జెడిఏ కు మరియు స్థానిక ఎమ్మెల్యే కు తీర్మాన పత్రాలను అందజేసి రైతులకు న్యాయం చేసే విధంగా అందరూ కృషి చేయాలని ఆయన తెలియజేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల కష్టాలను గుర్తించి కంది పంటకు పదివేల రూపాయల మద్దతు ధరను ప్రకటించి, కంది పంటను కొనుగోలు చేయాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,వ్యవసాయ శాఖ అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular