మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
Strict arrangements should be made for council elections
ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
జగిత్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)బి.ఎస్.లత
ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
కోరుట్ల,ఫిబ్రవరి 05
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నాలుగు జిల్లాలా శాసన మండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని
జగిత్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)బి.ఎస్.లత అధికారులకు సూచించారు.బుధవారం రోజు కోరుట్ల లోని ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ లను
అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత పరిశీలించారు.
ఈ నెల 27 న జరగబోయే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేందుకు గాను తగిన ఏర్పాట్ల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఎంపిక చేసిన 225, 226, 227, 228 నాలుగు పట్టభద్రుల పోలింగ్ స్టేషన్ లను ,142 ఉపాధ్యాయుల పోలింగ్ స్టేషన్ ని సందర్శించి తగు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసే సన్నద్ధంగా ఉండాలని అన్నారు.ఈ పర్యటనలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) తోపాటు ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసిల్దార్ కిషన్ , గిర్ధావర్ రాజేందర్ రావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.