26న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.
Success the Collectorate siege on 26th..
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి.
కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ల నాయకులు
దేవనకొండ నవంబర్ 23
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎం.నరసరావు లు కోరారు. ఈ మేరకు శనివారం స్థానిక సిఐటియు కార్యాలయం నందు సమావేశం సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. * ఈ సమావేశాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వీరశేఖర్, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎం. నరసరావు లు రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్ ల వలన కనీస వేతనం ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఎనిమిది గంటల పని దినం హక్కులు వంటి హామీలను రద్దు కాబోతున్నాయని ఆరోపించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక సంఘాలు కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాయని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఏడాది నుండి పలు రైతు సంఘాలు పోరాటాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పలు మల్టీ నేషనల్ కార్పొరేట్లతో వ్యవసాయ పరిశోధనల కోసం అనేక ఒప్పందాలు కుదుర్చుకుందినీ, ప్రభుత్వ రంగంలో ఎఫ్సీఐ సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ మార్కెట్ యార్డులను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు అద్దెకివ్వడం సరికాదన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర పాలకులు నాలుగు లేబర్ కోడ్ లాగా మార్చి అమలు చేయటానికి పూనుకుందన్నారు. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానాన్ని తుంగలో తొక్కిందని చెప్పారు. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాలలో మరింత పెంచి దోపిడీకి హద్దు పద్దు లేకుండా బిజెపి ప్రభుత్వం చేసిందన్నారు. సుమారు 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ లేబర్ కోడ్ లతో బానిసత్వంలోకి నెట్టబడ్డారని చెప్పారు. ఆహారము, ఆరోగ్యము, విద్య, ఉపాధి వంటి ప్రధాన హక్కులను కేంద్ర ప్రభుత్వం తమ జాబితా నుంచే తొలగించిందని అన్నారు. 13 నెలలపాటు నిరంతరంగా సాగిన రైతాంగ ఉద్యమం ప్రభావం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఈనెల 26న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. *ఈ కార్యక్రమంలో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు నాగేష్ పాండు నాగరాజు యూసుఫ్ బాషా బలరాముడు బడే సాహెబ్, రాఘవేంద్ర, భాస్కర్, మధు, శంకర్, శ్రీనివాసులు, మహేష్ మహేంద్ర పెద్దయ్య రాముడు బండ్లయ్య చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.