- Advertisement -
ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు
Supreme Court verdict on SC classification
అమలుపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ
హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ 12న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా.. వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహ కో చైర్మన్ గా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క (అనసూయ) ఎంపీ మల్లు రవి సభ్యులుగా క్యాబినెట్ సబ్ కమిటీ నియమించడం జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి పైన పేర్కొన్న సబ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి శమీమ్ అక్తర్ ని ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ గా నియమించడం జరిగింది..
కమిషన్ అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించిన అనంతరం సోమవారం ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఛాంబర్ లో సబ్ కమిటీకి అందజేసింది. ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ నివేదిక ను సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై చర్చించి రాష్ట్ర కేబినెట్ కు సిఫారసు చేయనుంది.
తరువాత రి 4వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ పై ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ మరియు సబ్ కమిటీ సిఫారసులను క్యాబినెట్ లో ప్రవేశపెడుతుంది. తర్వాత అదే రోజు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో వర్గీకరణ పై సబ్ కమిటీ చేసిన సిపసరసుపై లఘు చర్చ జరగనుంది.
- Advertisement -