తెలంగాణ చేనేత ఐక్య వేదిక
రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా భీమానాతి శారదా
నూతన కార్యదర్శి భీమానాతి శారదా
ధర్మపురి :
తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రానికి చెందిన భీమనాతి శారద భర్త కట్కం నరేందర్ లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ బుధవారం రోజు మధ్యాహ్నం వేళలో ఉత్తర్వులను జారీ చేశారు. గత కోన్ని సంవత్సరాలుగా సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మహిళ సాధికారికత కోసం ఎంతో కృషి చేసిన శారద సేవలను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఆమెకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. తన నియామకం పట్ల ఆమె రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ లతో పాటు, తెలంగాణ రాష్ట్ర సంఘాల పెద్దలకు కృతజ్ఞతలను తెలియజేశారు. శారద నియామకం పట్ల ఆమె స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, తదితరులు తమ సంతోషంను వ్యక్తం చేస్తూ ఇట్టి నియామకానికి కృషి చేసిన పెద్దలందరికి కృతజ్ఞతలను తెలియజేశారు.



