జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు పెన్షనర్ల,రిటైర్డ్ ఉద్యోగుల సంఘీభావం
జగిత్యాల: ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్ల,రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేది బీ.ఆర్.ఎస్.ప్రభుత్వమేనని,దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా అత్యధిక పీఅర్ సి.43 శాతం ఇచ్చిందన్న విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గుర్తు చేశారు.జిల్లా కేంద్రంలో పెన్షనర్స్,రిటైర్డ్ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్ కుమార్ వారి సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ మూడోసారి ముఖ్యమంత్రి గా కె సీ.ఆర్ పగ్గాలు చేపట్టేందుకు తనను రెండో సారి ఎమ్మెల్యే గా గెలిపించాలని రిటైర్డు ఉద్యోగులను,పెన్షనర్స్ ను అభ్యర్థించారు. పెన్షనర్స్ ,రిటైర్డ్ ఉద్యోగులు తనకు సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రములోని ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్ల పక్షపాతిగా బీఆర్ఎస్
సర్కారే నిలిచిందన్నారు. వీ.ఆర్.ఏ.లను ,వీ ఆర్వోలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ను గమని0చాలన్నారు. జగిత్యాలలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవన్లో ఆడిటోరియం నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయగా నిర్మిస్తున్నారని చెప్పారు. వివిధ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ కులాల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేశామని, జిల్లాకు మెడికల్ కాలేజీ,మాతా శిశు ఆస్పత్రి నిర్మాణం,రూ.20 కోట్లతో అధునాతన సౌకర్యాలతో పొలాస వ్యవసాయ కాలేజీ,24 గంటల ఉచిత విద్యుత్,మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు ,కాన్సర్ రోగులకోసం ప్రభుత్వ ఆస్పత్రి పాలియేటివ్ కేర్,తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.యమా డేంజర్ యావర్ రోడ్డు విస్తరణ కు జీవో జారీ చేయించామని,ప్రభుత్వ ఆస్థులల్లో 100 ఫీట్లు విస్తరణ చేయించామని,కొత్త మాస్టర్ ప్లాన్ ప్రజల కోరిక మేరకు రద్దు చేయించామన్నారు. మూడో సారి అధికారం లోకి వచ్చి పెన్షనర్స్ కు మంచి
పీఆర్సీ,అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.,జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్స్,జర్నలిస్టుల కు ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్య సేవల కోసం వెల్ నెస్ కేంద్ర ఏర్పాటుకు ఏడాది క్రితమే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును పెన్షనర్స్ తో కలిసి వెళ్ళి కోరామన్నారు. అధికారంలో మళ్ళి బీ.ఆర్.ఎస్.ప్రభుత్వమే వస్తుందని , పెన్షనర్స్ ,ఉద్యోగులకు,ఉపాద్యాయులకు,అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని,బీ.ఆర్.ఎస్. విజయం లో రిటైర్డ్ ఉద్యోగులు,పెన్షనర్స్ భాగస్వాములు కావాలని సంజయ్ కుమార్ అభ్యర్థించారు.. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ గతంలో అత్యధిక పీ అర్సీ 43 శాతం ఇచ్చినట్లే మళ్ళి వచ్చే పీఅర్సీ లో 46 శాతం మంజూరు చేయాలని,5 శాతం మధ్యంతర భృతిని మార్చి 20 శాతం పెంచి ఉత్తర్వులు జారీ చేయాలని,పెండింగ్ డి.ఏ.లు ఎక కాలంలో చెల్లించేలా,జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు,
ఉపాధ్యాయులు,పెన్షనర్స్,రిటైర్డ్ ఉద్యోగులకు,జర్నలిస్టుల కోసం వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాల పెన్షనర్స్ కు ఆదాయపు పన్ను మినహాయింపుకి కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరాలన్నారు.రియంబర్స్మెంట్ బిల్లులు,ఫస్టు తారీకునే పెన్షన్లు,తదితర పెన్షనర్స్ సమస్యల సత్వర పరిష్కారం కోసం పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని,ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీలు ఇవ్వాలని, పెన్షనర్స్ పలు డిమాండ్లను హరి ఆశోక్ కుమార్ ప్రస్తావించారు. .కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,సహాయ అధ్యక్షుడు పుప్పాల హన్మంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు వి.ప్రకాశరావు,ఎండి యాకోబు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావు, సత్యనారాయణ,మహిళా కార్యదర్శులు కరుణ, విజయలక్ష్మి,నాయకులు పురుషోత్తమ రావు,సంజీవ రావు,బి. రాజేశ్వర్,దేవేందర్ రావు,నారాయణ,సయ్యద్ యూసుఫ్, హన్మాండ్లు,
ఎం.డి.ఎక్బాల్,సురేందర్, యాకూబ్ హుస్సేన్, మదుసూదన్ రావు, ఉప్పుగళ్ల మురళీధర్, ప్రసాద్, గంగాధర్, ప్రభాకర్, కమలాకర్ , రాజ్ మోహన్,శివానందం, సైఫోద్దోన్, నర్సయ్య, రవీందర్, శంకర్, తదితరులు ఉన్నారు.