దేశ స్థితిగతిని మార్చే బడ్జెట్… వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు..
The budget that will change the status of the country... Modi government's steps towards a developed India..
బడ్జెట్ కెటాయింపు పట్ల గంగాధర మండల బీజేపీ నాయకుల హర్షం
చొప్పదండి
బీజేపీ పార్టీ గంగాధర మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలో బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకo కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో రక్షణ ,విద్య ,వైద్యం వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యమని అన్నారు.
12 లక్షల వరకు టాక్స్ మినహాయింపు కోట్లాదిమందికి గొప్ప శుభవార్త అని తెలిపారు.
50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులనుప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని , అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్ జిల్లా కోశాధికారి వైద రామాంజం మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం , స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా బడ్జెట్లో భారీగానిధులుకేటాయించారన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ తో పాటు 36 రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ పై కస్టం డ్యూటీ నుంచిమినహాయించడంతో వాటికి సంబంధించిన మందులు ఇకపై చౌకగా లభిస్తాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన మందులు చౌకగా లభించే విధంగా బడ్జెట్లోకేటాయింపులు జరపడం శుభపరిణామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పుధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం, పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయన్నారు.50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చారిత్రకమైందని,బడ్జెట్ కేటాయింపులన్నీ అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఉచితాల పేరుతో ప్రజలను మాయ చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు మింగుడు పడడం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రతిపక్షాలకు ,కొన్ని వర్గాలకు భయం కలిగించిందని, అమెరికా డీప్ స్టేట్, చైనా,పాకిస్తాన్ సోనియా, రాహుల్,కమ్యూనిస్టులు,మావోయిస్
రాజేంద్రప్రసాద్,హర్ష రాజు,వొడ్నాల రాజు,ప్రణయ్,ప్రభాకర్ రెడ్డి,మహేష్ భార్గవ్,కట్ల వెంకటేష్,కుమార్ కొమురయ్య,అనిల్ శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.