Friday, January 17, 2025

టీడీఆర్ లెక్క 150 కోట్లపైనే

- Advertisement -

టీడీఆర్ లెక్క 150 కోట్లపైనే

The calculation of TDR is 150 crores

తిరుపతి, జనవరి 7, (వాయిస్ టుడే)
తిరుపతి నగర పాలక సంస్థకు ఏకంగా 150కోట్లు రూపాయలు నష్టం చేకూర్చారని విజిలెన్స్ నివేదికలో తేల్చింది. మాస్టర్ ప్లాన్ రహాదారుల కోసం సేకరించిన అస్తులను కమర్షియల్ గా మార్చి వాటి విలువ పెంచి అయిన వారికి ఇష్టానుసారం టీడీఅర్ బాండ్స్ ఇచ్చారని దీంతో నగర పాలక సంస్థ నష్ట పోయిందని నివేదిక తేల్చి చెప్పింది. మాస్టర్ ప్లాన్ రహాదారుల పేరుతో భూమన గ్యాంగ్ చేసిన దందా బయటపడిందని అంటున్నారు. ఈ స్కాంలో భూమనతో పాటు పలువురు వైసీపీ నేతలు, ప్రభుత్వం యంత్రాంగం మెడకు ఈ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమంట.వైసీపీ పాలకులు అయిన వారికి ఇష్టానుసారం ప్రభుత్వ ధనాన్ని దోచి పెట్టారు. వివిధ పథకాల పేరుతో తమ వారికి అయాచిత లబ్ధి చేకూర్చారు. దీంతో పాటు తాము లబ్ధిపొందారు..ఈ విధంగా జరిగింది తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం.. మొత్తం మాస్టర్ ప్లాన్ రహదారుల్లో ఏకంగా 104 రహదారుల నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేశారు. 2003 సంవత్సరం చివర్లో హడావుడిగా నిర్మాణం పనులు నెత్తికెత్తుకున్నారు.. ఇందులో బాగంగా 23 రహదారుల నిర్మాణం పూర్తి చేసారు.అయితే వాటి కోసం 1,389 అస్తులను సేకరించారు. వారికి పరిహారం ఇవ్వడానికి నిధులు లేక పోవడంతో టీడీఅర్ బాండ్ల ఇవ్వడం మొదలు పెట్టారు. అక్కడే అసలు మతలబు జరిగింది. . ఆ రహదారులు వేస్తుంది తమ అస్తుల విలువ పెంచుకోవడానికే అని అప్పట్లో విమర్శలు వచ్చాయి.. దానికి తగ్గట్లు గానే వైసీపీ హయాంలో రహదారులు వేసిన ప్రాంతాలలో ఆ పార్టీ కీలక నేతలు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు స్థానిక నేతలు, కార్పొరేటర్ల , చివరికి గల్లీ నేతల అస్తులు కూడా ఉన్నాయి. కొత్త రహదారులు వేయడం పుణ్యమాని వాటి ధరలు పెరిగి పోయాయి.ఇక అదే సమయంలో సదరు నాయకులు తమ అస్మదీయులకు న్యాయం చేయాలని భావించారు. అందులో భాగంగా రెసిడెన్షియల్ ఏరియాలను సైతం కమర్షియల్‌గా మార్చి వేశారు.. అందుకు గాను తమ వారితో అప్పటి కప్పుడు రహదారి వేస్తున్న ప్రాంతాలలో కమర్షియల్ షెడ్స్ వేయించడం లాంటి కార్యకలాపాలు చేయించారు. చిన్న పాటి హోటల్స్ పెట్టించారు. వాటిని చూపిస్తూ అ ఏరియా మొత్తం కమర్షియల్ లెక్కలతో రికార్డులు తయారు చేయించారు. ఆ విధంగా వారు చేయడంతో పెద్ద ఎత్తున నగర పాలక సంస్థ కు ఖజానాకు నష్టం వాటిల్లింది. దానికి తోడు రిజిష్ట్రార్ కార్యాలయంలో అధికారులతో మార్కెట్ వాల్యు పెంచి అంచనాలు వేయించారు.మాస్టర్ ప్లాన్ రహదారుల కోసం మొత్తం 1,389 అస్తులను సేకరించగా అందులో టీడీఅర్ బాండ్ల జారీకి అర్హమైనవని 1,149గా తేల్చారు. ఎన్నికల లోపే హడావుడిగా 442 బాండ్ల ను జారీ చేశారు. ఇంకా 707 ఆస్తులకు సంబంధించి బాండ్ల ను జారీ చేయాల్సి ఉంది. అప్పట్లోనే వీటి పైన టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో వాటిపై అప్పటి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి అయిన లక్ష్మి విచారణకు అదేశించారు. దాంతో మిగతా స్థలాలకు టీడీఆర్ బాండ్లు జారీ చేయలేక పోయారు. జారీ చేసిన టీడీఆర్ బాండ్ల విలువ 850 కోట్లు కాగా అందులో అనవసరంగా 150 కోట్లు పెంచారని .. వాస్తవ విలువ 700 కోట్లుగా విజిలెన్స్ తేల్చి చెప్పింది.మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డేనంట.. భూమనతో పాటు ఆయన కూమారుడు మాజీ డిప్యూటీ మేయర్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భూమన అభినయ్‌రెడ్డి‌తో పాటు అప్పట్లో పనిచేసిన నగర పాలక సంస్థ కమిషనర్ హారిత, టౌన్ ప్లానింగ్ , నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులు దందా మొత్తం నడిపించారని అంటున్నారు. భూమన కరుణాకరరెడ్డి పర్సనల్‌గా తీసుకుని నడిపించిన ఈ తతంగంలో ఎవరి వాటాలు వారికి ముట్టాయంటున్నారు.మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతుండటంతో మరింత మంది పాత్ర బయటపడే అవకాశముందంట. దీనికి సంబంధించి తమ కంటే రిజిష్టేషన్ శాఖ సిబ్బంది ప్రధానంగా ఇరుక్కు పోతారని… తమకేమి నష్టం లేదని తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు అంతర్గత సంభాషణల్లో అంటున్నారంట.. మొత్తం మీద మున్సిపల్ శాఖ సైతం దీనిపై అనంతపురం అర్జేడీ విశ్వనాథ్ అధ్వర్యంలో ఎంక్వయిరీ చేయించింది. ఆ నివేదిక కూడా బయట పడితే ఈ కుంభకోణంలో తిమింగలాలతో పాటు చిన్నా చితకా చేపల భాగోతం కూడా బయటపడుతుందంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్