AIIMSకి చెందిన ఐదుగురు డాక్టర్లు
విస్టారా ఫ్లైట్‌లో సీపీఆర్
బెంగళూర్, ఆగస్టు 28: బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్టారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారికి అస్వస్థకు గురైంది. ఊపిరాడక ఇబ్బంది పడింది. ఆ ఫ్లైట్‌లోనే ఢిల్లీ AIIMSకి చెందిన ఐదుగురు డాక్టర్లు ప్రయాణిస్తున్నారు. వెంటనే చిన్నారి పరిస్థితిని గమనించారు. అప్పటికే చిన్నారి పల్స్ పోయింది. శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. శ్వాస తీసుకోడమూ ఆగిపోయింది. విమానం గాల్లో ఉండగానే వెంటనే CPR చేశారు డాక్టర్లు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి ఫ్లైట్‌ని నాగ్‌పూర్‌కి మళ్లిస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ చేశారు. అప్పటిలోగా చిన్నారికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రాథమిక చికిత్స అందించారు. అందుబాటులో ఉన్న మెడికల్ డివైజ్‌లతోనే చిన్నారి ప్రాణం పోకుండా కాపాడారు. IV Canullaతో చికిత్స చేశారు. మళ్లీ సాధారణ స్థితికి వచ్చి ఊపిరి తీసుకునేంత వరకూ చాలా సేపు శ్రమించారు. గుండెపోటు వచ్చిందని గుర్తించి వైద్యులు దాదాపు 45 నిముషాల పాటు మెడికేషన్ చేశారు. కాసేపటికి ఫ్లైట్ నాగ్‌పూర్‌కి చేరుకుంది. వెంటనే చిన్నారిని పీడియాట్రిషియన్‌కి అప్పగించారు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను Delhi AIIMS ట్విటర్‌లో షేర్ చేసింది. రెండేళ్ల చిన్నారి ప్రాణాలను CPRతో కాపాడాం అంటూ ట్విటర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.