తొలి స్వాతంత్ర సమర యోధుడు వడ్డె ఓబన్న
The first freedom fighter was Wadde Obanna
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల,
తొలి స్వాతంత్ర సమర యోధుడు వడ్డె ఓబన్న ఆని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కొనియాడారు.శుక్రవారం మండలంలోని మాదాపూర్ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న
విగ్రహాన్ని సంఘ నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు సమాజం కోసం ప్రాణాలు లెక్కచేయని ఆయన వ్యక్తిత్వం యువతకు ఆదర్శమన్నారు.. వడ్డెర్లు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం పరంగా అన్నిరకాల సహాయ, సహకారాలు అందిచాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారి శెట్టి రాజేష్, మాజీ రైతు సమన్వయ
సమితి జిల్లా అధ్యక్షుడు చిటీ వెంకట్రావు, ఎంపీపీ తోట నారాయణ, మాజీ సర్పంచ్ అంజయ్య, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు,వడ్డెర సంఘం నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు