గ్రేటర్ ఓటరు ఎటూ వైపు
హైదరాబాద్, మార్చి 13,
లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్ ఎటు వైపు ఉంటాడనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ లో ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయా లేక గ్రేటర్ ఓటర్లు మరోలా తీర్పును ఇస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద ,చేవెళ్ల, మల్కాజ్ గిరి గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో నాలుగు పార్టీలు గెలుచుకున్నాయి.హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించగా, సికింద్రాబాద్‌లో బీజేపీ, చేవెళ్లలో బిఆర్ఎస్, మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. వీటిలో చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే గ్రేటర్ కు దగ్గరగా ఉంటాయి.హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులోని మలక్ పేట,కార్వాన్ చార్మినార్, చంద్రాయణ గుట్ట,యాకుత్‌పురా , బహదూర్పురాలో ఎంఐఎం పార్టీ గెలిచింది. గోషామహల్ స్థానం మాత్రం బీజేపీ దక్కించుకుంది.సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ , సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ గెలిచింది. నాంపల్లిలో మాత్రమే ఎంఐఎం గెలిచింది.చేవెళ్ల లోకసభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహేశ్వరం ,రాజేంద్రనగర్ , శేరి లింగంపల్లి ,చేవెళ్ళలో బిఆర్ఎస్ విజయం సాధించింది. ఈ స్థానాలు గ్రేటర్ కు దగ్గరగా ఉంటాయి. మిగిలిన పరిగి ,వికారాబాద్, తాండూర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.మల్కాజ్ గిరి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . మేడ్చల్ , మల్కాజ్‌గిరి ,కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ ,సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికలను అన్నీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈ కీలక సమయంలో బిఆర్ఎస్ పార్టీకి మాత్రం వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కరుగా కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వివిధ కారణాలతో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్ లలో గులాబీ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోగా….42 డివిజన్ లలో ఎంఐఎం, 40 డివిజన్‌లలో బీజేపీ, 11 డివిజన్ లలో కాంగ్రెస్ విజయం సాధించింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్ లో కారును ఖాళీ చేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా మెజారిటీ నేతలు రేవంత్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉండడంతో బిఆర్ఎస్ లో ఆందోళనలకు దారి తీసింది.పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ స్థానాలను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.సికింద్రాబాద్ ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది. అక్కడి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈసారి సికింద్రాబాద్ స్థానంపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మాజీ మేయర్ రామ్మోహన్‌కు సికింద్రాబాద్ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం ఎటూ కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది.ఇక్కడి నుంచి గత లో సభ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పదవి దక్కించుకున్నారు. దీనిని కూడా చేజారిపోకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.ఇందులో భాగంగానే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.బిఆర్ఎస్ ఖాతాలో ఉన్న చేవెళ్ల సీటును కూడా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.అధికారం చేపట్టినప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నే మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు.ఇప్పటికే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం,రూ.500 లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ భీమా పెంపు,ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకలను రేవంత్ ప్రారంభించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం అడుగులు వేయడం ప్రభుత్వానికి ప్లస్ అయింది. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి మంచి స్పందన వస్తుండటం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది.గ్రఓటర్లపై కాంగ్రెస్ పాలన ప్రభావం ఉండవచ్చని ఈసారి గ్రేటర్ ఓటరు మనసు మారి కాంగ్రెస్ వైపు చూడవచ్చనే అంచనాలు ఉన్నాయి. గ్రేటర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియడానికి మరికొంత సమయం పట్టనుంది.
గ్రేటర్ ఓటరు ఎటూ వైపు
- Advertisement -
- Advertisement -