- Advertisement -
వ్యక్తి దారుణ హత్య
The man was brutally murdered
బషీరాబాద్ నవల్గా గేటు వద్ద ఘటన
వికారాబాద్
ఓ వ్యక్తి తలపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నవల్గా గేటు సమీపంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నవల్గా గ్రామానికి చెందిన మాల శ్యామప్ప గ్రామ సమీపంలోని గేటు వద్ద హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బషీరాబాధ్ ఎస్ఐ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్యామప్ప తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో ఎస్ఐ శంకర్ వివరాలను సేకరించారు.
గ్రామస్తులతో మాట్లాడి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. గ్రామానికి చెందిన శ్యామప్పను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడంతో స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -