ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
The Minister inaugurated the Primary Health Sub-Centre
కోహెడ
కోహెడ మండలం బస్వాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరైయారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, డి ఎం హెచ్ ఓ, కోహెడ ప్రైమరీ హెల్త్ సెంటర్ డా. నిమ్ర , బస్వాపూర్ ఉప కేంద్రం సాత్విక ఇతర మండల అధికారులు పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ బస్వాపూర్ పల్లె దవాఖానా ప్రారంభించుకున్నాం అందరికీ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలి. సామాజిక బాధ్యత అందరి వద్ద ఉండాలి. పాత టైర్లు పాత గోళాలు ఉంటాయి. వాటిని తొలగించండి.నీళ్ల నిల్వ లేకుండా చూసుకోవాలి దోమలను నివారించాలి. యువత కోరుతున్న గ్రామ పంచాయతీ ఎంత చేసిన మీ అందరి సహకారం ఉండాలి. ఎవరి ఇళ్లు వారు పరిశుభ్రంగా చేసుకొని మీ కాలనీలు యూనిటీ గా శుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామంలో జ్వరం కేసులు అధికంగా ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. స్వచ్చ ధనం – పచ్చదనం లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సంవత్సరం పొడవునా శుభ్రంగా ఉంచుకునేది మీరే. పల్లె దవాఖానా ను ఉపయోగించుకోండి. అందరూ బాగుండాలి. బీపీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వంట వండేటప్పుడు పెరుగు తినేటప్పుడు వాటిలో ఉప్పు వేసుకోవద్దు శరీరానికి నష్టం చేకూరుస్తుంది. ఆయిల్ తక్కువగా వాడాలి. బీపీ వల్ల షుగర్ కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ కి దారి తీస్తుంది. అందరూ బీపీ చెక్ చేసుకున్న తరువాత టాబ్లెట్స్ వాడాలి ఇతర వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇది ఒకరికి పరిమితం కాదు అందరూ పాటించాలి. ఆరోగ్యం వైద్యో నారాయణ హరి డాక్టర్లు దేవుడితో సమానం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు చెప్పేది పాటించాలి. వేడి అన్నం తినాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఈ నియోజకవర్గంలో 30 మేజర్ గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఓపెన్ జిమ్ లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 శాతం గ్రామాల్లో 500 మంది ఒకేసారి తినే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. మహిళా సంఘాలకు మైంటనేన్స్ ఇస్తాం. ప్లాస్టిక్ వాడద్దు అనే నినాదం తో ముందుకు పోతున్నాం. అందరూ నియమాలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు.



