రహదారుల ప్రమాదాలను నివారించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం :

- Advertisement -

రహదారుల ప్రమాదాలను నివారించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం :

The mission of the State Government is to prevent road accidents:

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
గుంతలు లేని రహదారుల ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం
చంద్రగిరి ఎం ఎల్ ఏ పులివర్థి నాని
తిరుపతి,
రాష్ట్ర ప్రభుత్వం రహదారి ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా  గుంతలు లేని రహదారుల కార్యక్రమానికి “ మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ “ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనీ, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.శనివారం ఉదయం స్థానిక చంద్రగిరి నియోజకవర్గంలోని దామల చెరువు దగ్గర నుండి గుంతలు లేని రహదారులను  మరమ్మత్తులు చేసే కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లన్నీ బాగు చేసుకునే కార్యక్రమానికి గౌ. ముఖ్యమంత్రి అనకాపల్లిలో ప్రారంభించగా నేడు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి  చంద్రగిరి నియోజకవర్గo నుంచి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎన్నికల హామీలో భాగంగా రహదారుల ప్రమాదాలను నివారించే దిశగా గుంతలు లేని రహదారుల మరమ్మత్తులు చేయాలని, రోడ్ల  నిర్వహణ పై సరైన శ్రద్ధ లేనీ కారణంగా   తరచూ ప్రమాదాలు  జరుగుతున్నాయని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ దయనీయ స్థితిలో ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని దృఢనిశ్చయంతో నేడు గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 66 రహదారుల మరమ్మత్తుల పనులను 12 కోట్ల 34  లక్షల తో పనులను మొదలుపెట్టడం జరిగిందని, ఇంకా  55 రకాల మరమ్మత్తుల పనుల కోసం. 95 కోట్లతో పనులను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. కావున జిల్లాలోని అన్ని రహదారుల మరమ్మతుల పనులను యుద్ధ ప్రాతిపదికన నాణ్యతతో  పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని  ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 89 లక్షల 50 వేల రూపాయలతో 87 కిలోమీటర్ల మేర గుంతలు లేని రహదారులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular