- Advertisement -
మహేశ్వరంలో పోటీ చేస్తున్న స్థానికేతరులను ఓడించాలి: బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి బీఎస్పీకి ఎనలేని ఆదరణ మహేశ్వరంలో బీఎస్పీ జెండా ఎగురవేస్తాం మహేశ్వరం, వాయిస్ టుడే: మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేయడానికి స్థానిక నేతలెవరు లేనట్లు స్థానికేతరులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిలకు టికెట్లను ఇచ్చారని, వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని మహేశ్వరం బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ఓటర్లను కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అవినీతిలేని పాలన అందిస్తానని భరోసా కల్పించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. బహుజనుల అభివృద్ధికి పాటుపడే ఏకైక పార్టీ బీఎస్పీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



