28.7 C
New York
Sunday, June 23, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం ముక్త్యాల రాజా వారు

- Advertisement -

*నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం ముక్త్యాల రాజా వారు

*The origin of the construction of Nagarjunasagar project was Muktyala Raja*ni

నేడు శ్రీ రాజావారి 53వ వర్ధంతి

నల్లగొండ: మే30 (వాయిస్ టుడే ప్రతినిధి) నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం ఏ మహానుభావుడో తెలుసుకోవాలని ఉందా?

 

ఈ ఫోటోలోని పుణ్యమూర్తిని రోజు స్మరించుకోండి, వారి చిత్రపటానికి రోజూ నమస్కరించండి, కొంచెం కష్టపడి అయినా ఓపికగా వారి చరిత్ర చదవండి.

 

ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల లో మనం ఈ రోజు సుభిక్షంగా పాడి పంటల తో ఉన్నామంటే వారే కారణం, వంశ పరం పర్యంగా వచ్చిన రాజరికంతో తృప్తి చెందలేదు.

 

ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో, తన సొంత ఖర్చులతో వూరు వూరు తిరిగి రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ ని స్థాపించి నాగార్జున సాగర్ వద్ద( నంది కొండ వద్ద ) ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంకా ఉపయోగపడి ఆ నీటితో పంటలు పండించుకుని కరువులు దూరం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి అయి తెలుగునేల అన్నపూర్ణగా, భారత దేశ ధాన్యగారంగా మారుతుందని తలంచి, అనకట్టలు ఆధునిక డేవాలయాలని భావించి బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదించి నాగార్జున సాగర్ నిర్మాణం పై పాలకుల దృష్టి పడేలా చేశారు.

 

ఈలోగా దేశానికి స్వాతంత్య్రం రావడంతో, కేంద్ర ప్రభుత్వం వద్దకు రైతులను పెద్ద సంఖ్యలో తీసుకెళ్లి గాంధీజీ గారికి నాటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు, పటేల్ దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ పరిశీలనకై ఖోస్లా కమిటీని నియమించింది.

 

ఆనాడు కీకరణ్యంగా ఉన్న ప్రాజెక్ట్ ప్రదేశానికి తన సొంత ఖర్చులతో విజయవాడ నుండి దారి నిర్మించి వారికి ఆప్రదేశాన్ని, అక్కడి కృష్ణమ్మ జల సిరిని చూపి ఆ కమిటీని ఒప్పించి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు గారితో 1955లో నాగార్జునసాగర్ నిర్మాణానికి పునాది రాయి వేయించి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించి దేశం లోని ఓ పెద్ద బహుళార్ధక ప్రాజెక్ట్ ను నిర్మింప జేసిన మహానుభావుడు.

 

ఈ నాలుగు జిల్లాలో ప్రజలు ఈరోజు అన్నం తింటున్నారంటే ఆమహాను భావుని చలవే,

 

ఆ మహాను భావుడే గౌరవ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలక్రిష్ణ మహేశ్వర ప్రసాద్, జగ్గయ్యపేట వద్ద గల ముక్త్యాల సంస్థనాధీశుడు, మనందరి దేవుడు మనం తినే ప్రతి మెతుకులో వీరిని స్మరించుకోవాలి, వీరి గాధ పిల్లలకు చెప్పండి, మిత్రులతో పంచుకోండి.

 

అందరికీ ఈ సమాచారం పంపించండి ఓపికగా చదివి మీరు కూడా అందరికీ ఈ సమాచారం తెలియజేసిన అందుకు ధన్యవాదాలు,1972 లో స్వర్గస్థులైన శ్రీ శ్రీ రాజవాసిరెడ్డి గోపాలక్రిష్ణ మహేశ్వర ప్రసాద్ గారికి ఇవే మన నివాళులు…..

జోహార్ రాజా గారూ.. జోహార్. (సేకరణ: ఏనుగుల వీరాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్)

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!