Friday, September 20, 2024

బీజేపీ పోరుబాట, బస్తీల బాట

- Advertisement -
The struggle of BJP is the path of slums
The struggle of BJP is the path of slums

పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం

కార్యాచరణను ప్రకటించిన తెలంగాణ బీజేపీ

16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై “బస్తీల బాట”

18న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు

సెప్టెంబర్ 4న డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా

బీజేపీ రాష్ట్ర అద్యక్షులు  కిషన్‌రెడ్డి

The struggle of BJP is the path of slums
The struggle of BJP is the path of slums

హైదరాబాద్ ఆగష్టు 12 :  పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ బీజేపీ కార్యాచరణను ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్లపై ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై “బస్తీల బాట” చేపడతామని.. బస్తీ, పేద ప్రజలను కలిసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 18న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే 23, 24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, వచ్చే నెల 4న డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ కండ్లు తెరిపించే విధంగా ధర్నా ఉంటుందన్నారు. ఇండ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా అని టీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించాలని.. నిలదీయాలని నేతలకు పిలునిచ్చారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల ప్రభుత్వమని పేద ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఫామ్ హౌస్‌లో, ప్రగతి భవన్‌లో నిద్ర పోతున్నది కేసీఆర్ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. వరదలొచ్చిన సీఎం కేసీఆర్ బయటకు రారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్