- Advertisement -
కోరుట్ల, మెట్పల్లిలలో దొంగల హల్ చల్
There is a lot of thieves in Korutla and Metpalli
జగిత్యాల
జగిత్యాల జిల్లా కోరుట్ల,మెట్ పల్లి పట్టణాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న పలు దుకాణాలలో షట్టర్లు పైకి లేపి దొంగలు నగదును ఎత్తుకెళ్లారు.పట్టణంలోని ప్రధాన చౌరస్తా అయిన పాత బస్టాండ్ వద్ద రెండు షాపులలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న చిల్లర నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.అలాగే కోరుట్ల పట్టణంలో మూడు దుకాణాలలో చోరీకి పాల్పడి 10 వేల నగదు అపహరించుకుపోయారు.గత రెండు మూడు నెలలలో రెండు మూడుసార్లు దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.పట్టణ నడిబొడ్డున జాతీయ రహదారి కానుకొని దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.పోలీసుల పెట్రోలింగ్ పెంచి,దొంగతనాలు జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
- Advertisement -