Tuesday, January 14, 2025

కేసులకు భయపడేది లేదు.. తగ్గేదే లేదు

- Advertisement -

కేసులకు భయపడేది లేదు.. తగ్గేదే లేదు

There is no fear of cases.. There is no decrease

హైదరాబాద్
బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్ద మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి ఈ కేసుకి పొంతనలేదు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడు. కేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఈమేజి కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడి గుండు కి ముడి వేయడమే. ఎన్ని రకాల కేసులు పెట్టిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనకకిపోము. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం. అక్రమ కేసులతోనూ అరెస్టులతోనూ మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు. ఎన్ని రకాల కేసులు పెట్టిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము. ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు. కేసులో అవినీతి ఉందని శిక్ష వేసిన తీర్పు కాదు. ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు… విచారణ చేసుకోమని కోర్టు చెప్పింది. గతంలో కూడా కేటీఆర్ గారు విచారణకు సిద్ధమని చెప్పాము. ఒక్క రూపాయి కూడా చేతులు మారినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది. కేటీఆర్ అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ కేసు. అటేన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధు ఎగగొట్టడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అక్రమ కేసు పెట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. భవిష్యత్తులను ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కోసం కేసులు రేవంత్ రెడ్డి పెడతాడని మాకు తెలుసు. ఎన్నో పోరాటాలతోనే త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ అభివృద్ధిని మా పార్టీకి ముఖ్యం . రేవంత్ రెడ్డి ని కూడా ఫార్ములా ఈ కంపెనీ కలిసిన ఇప్పటిదాకా బయట పెట్టలేదని అన్నారు.
రైతు భరోసాను తగ్గించి ప్రజలకు ఇస్తున్నందుకు… వారి నుంచి వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఈ కేసు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే. ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే. కేటీఆర్ గారి పెట్టిన కేసులు కానీ పార్టీ నేతల పైన పెడుతున్న కేసులను కానీ పార్టీ ఎదుర్కొంటుంది. కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం. ఆయన ముఖ్యమంత్రిగా మాకు అధికారుల పైన కోర్టుల పైన విసం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి పైన లేదు. కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
కానీ హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని, విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. కేటీఆర్ పైన పెట్టిన కేసు తూఫెల్ కేసు. అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్ళం కాదు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది. గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారు. గ్రీన్ కోకి రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు. అదే గ్రీన్కో కంపెనీ ఫార్ములా అయ్యే నిర్వహణలో భారీగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్