Monday, May 18, 2026

ఉర్దూ లేదని బోర్డు తీయించేసారు

- Advertisement -

ఉర్దూ లేదని బోర్డు తీయించేసారు

They took out the board saying that there was no Urdu

రాజాసింగ్.. ఎమ్మెల్యే
హైదరాబాద్
అరంఘర్ జూ పార్క్ ఫ్లై ఓవర్ పై ఎంఐఎం జెండాలు పెట్టినా ప్రభుత్వం ఏమీ అనలేదు. ఎంఐఎం గూండాలను పక్కన పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఫ్లై ఓవర్ ఓపెన్ చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఆదివారం అంబర్ పేట ఫ్లై ఓవర్ వద్ద సైన్ బోర్డ్ పై ఉర్దూ భాష లేదని ఆర్అండ్బీ అధికారులను అసదుద్దీన్ బెదిరించారు. గూండాలతో బెదిరించి బోర్డు ను తీసివేయించాడు. అంబర్ పేట ఏమైనా అసదుద్దీన్ నియోజకవర్గమా. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గానికి చెందింది. అర్ అండ్ బీ అధికారులు ఇలానే చేస్తారా . సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్ లాంటి వ్యక్తి ని నెత్తిన ఎక్కించుకుంటున్నాడని మండి పడ్డారు.
అసదుద్దీన్, అక్బరుద్దీన్ లు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ని తిట్టారు. మా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే మాతో కూడా దోస్తానా చేస్తారు అసదుద్దీన్ ఒవైసీ , అక్బరుద్దీన్ ఒవైసీ లు. మోదీ జిందాబాద్, యోగి జిందాబాద్ అంటారు. ఇది ప్రజా సొమ్ము తో నిర్మించిన ఫ్లైఓవర్ . అక్కడ ఏ భాషలో బోర్డు పెట్టాలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్ణయించాలి. తెలంగాణ లో ఎంఐఎం గూండా రాజ్యం ఎలా నడుస్తుందో ప్రజలు గమనించాలి. బోర్డుపై ఉర్దూ లేదని బోర్డు తీసేయించిన ఎంఐఎం నేతలు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో ఆలోచించాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్