- Advertisement -
తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే – ఆర్డీవో ఎన్.శ్రీనివాస్
Those who neglect their parents deserve punishment - RDO N. Srinivas
మెట్ పల్లి
వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ అన్నారు.బుధవారం మెట్ పల్లి డివిజన్ కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెట్ పల్లి డివిజన్ శాఖ కార్యాలయంను కళా నగర్ లో ఆర్డీవో,డి.ఎస్పీ లు ప్రారంభించారు.అనంతరం స్థానిక స్వర్ణకార సంఘ సమావేశ మందిరంలో సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ మెట్ పల్లి డివిజన్ శాఖ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంక్షేమ,రక్షణ చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు.అసోసియేషన్ ముద్రించిన 2025 క్యాలెండర్లను ఆర్డీవో,డి.ఎస్పీ లు ఆవిష్కరించారు. సీనియర్ సిటీజేన్స్ గుర్తింపు కార్డులను ఆర్డీవో,డి.ఎస్పీ,లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్,డి.ఎస్.పి.రాము లు, సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్, లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ వయో వృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 14567 ఉందని ,వారిని నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే వీలుందన్నారు. మెట్ పల్లి డి.ఎస్పీ రాములు మాట్లాడుతూ వయో వృద్ధులు సమాజ మార్గదర్శకులని,దేశ సంపద అని అన్నారు.పోలీసు శాఖ తరపున సీనియర్ సిటీజేన్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.సీనియర్ సిటీనేజెన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏకయిక సీనియర్ సిటీజేన్స్ అస్సోసియేషన్ తమదేనన్నారు. తమ అస్సోసియేషన్ ప్రతినిధులు జిల్లాలో వయోవృద్దుల సంరక్షణ చట్టం అమలులో ప్రభుత్వం కు సహకరిస్తూ తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు,కూతుర్లు,కోడళ్లకు కౌన్సెలింగ్ లు చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. .ఆదర్శ ప్రజా ఆర్డీవో గా మెట్ పల్లి ఆర్డీవో కొద్ది కాలానికే పేరు తెచ్చికున్నారని,వయోధికుల కేసుల పరిష్కారం లో నెంబర్ వన్ గా నిలిచారని కొనియాడారు. .శాంతిభద్రతల పరిరక్షణ లో డి.ఎస్పీ రాములు సేవలు ఆదర్శనీయమన్నారు. , ఇటీవల వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 లో సవరణలకు తమ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహ రావు అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృద్ధులకు మరింత భరోసా కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు వొజ్జల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మెట్ పల్లి డివిజన్ లో నిరాదరణకు గురయ్యే వయోధికులు తమ అసోసియేషన్ ను సంప్రదిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా సీనియర్ సిటీజేన్స్ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వి.ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి, ,ఎం.డి.యాకూబ్, మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్,కోశాధికారి వెల్ముల ప్రభాకర్ రావు,ఉపాధ్యక్షుడు ఎం.స్వామి, సీనియర్ సిటీజేన్స్ కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్ మోహన్,స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నాంపల్లి సింహాద్రి,వడ్రంగి సంఘం అధ్యక్షుడు పి.చంద్రయ్య, మెట్ పల్లి ఇబ్రహీంపట్నం,మల్లాపూర్ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -