Wednesday, February 18, 2026

కూకట్ పల్లి లో బీసీలకే టికెట్ కేటాయించాలి.

- Advertisement -

బిసిలకు టికెట్ కేటాయించకపోతే ఏకతాటిపై నామినేషన్ దాఖలు చేస్తాం
బీసీ ఐక్య వేదిక కన్వీనర్ భాశెట్టి నర్సింగ్ రావు

కూకట్ పల్లి : నవంబర్ 1(వాయిస్ టుడే): కూకట్ పల్లి బీసీ ఐక్య వేదిక కన్వీనర్ భాశెట్టి నర్సింగ్ రావు, కొకన్వీనర్ యంజాల పద్మయ్య బుధవారం బీసి ఐక్య వేదిక కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కన్వీనర్ భాశెట్టి నర్సింగ్ రావు మాట్లాడుతూ సీఎం చంద్రశేఖర్ రావు మొదటిగా దళితులకు, మైనారిటీ లకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లు అమలు చేయగా బీసీ వికాస సమితి ధ్వారా బీసీ లకు కూడా కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు అమలు చేయాలనీ రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వానికి విన్నపాలు పోరాటాల ఫలితంతో సాధించామని, బీజేపీ ఆధ్వర్యంలో సూర్యాపేట లో నిర్వహించిన జనగర్జన సభలో కేంద్ర మంత్రి అమీత్ షా బీజేపీ ప్రభుత్వం అధికారం లో వస్తే బీసీ వర్గానికి ముఖ్య మంత్రి పదవి అని ప్రకటించినందుకు బీసీ ఐక్య వేదిక ద్వారా అభినందనలు తెలియచేస్తున్నామని తెలిపారు. అలాగే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎంఎల్ఎ అభ్యర్థులను అధికంగా కేటాయించాలని బీసీ వర్గానికే ముఖ్యమంత్రి పదవి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి బీజేపీ అభ్యరర్థిని ప్రకటించిన తర్వాత బీసీ ఐక్య వేదిక సమావేశమై కూకట్ పల్లి లో ఎవరికి మద్దత్తు ఇవ్వాలనేది బీసీ ఐక్య వేదిక నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపాలనే దానిపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో తూము శైలేష్ కుమార్, వడ్ల వెంకటేష్, రామచర్ల శేఖర్ గౌడ్, తూము సంతోష్, సప్పిడి వెంకటేష్, సిపిఐ కృష్ణ, సి పండిత్ రావు, సారా శ్రీకాంత్, ఆంజనేయులు, మురళి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్