కూకట్పల్లి : అక్టోబర్ 28(వాయిస్ టుడే): రాష్ట్రంలోని అధిక జనాభా గల మున్నూరు కాపులకు జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ పార్టీ లో 10 నుంచి 15 టికెట్లు కేటాయించాలనే నేపథ్యంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నీ కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలోని మున్నూరు కాపులకు టికెట్లను అభ్యర్తిత్వ ఆశావాహులకు అధికంగా కేటాయించినట్లయితే వారిని మేము గెలిపించు కుంటామని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వాసాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి తేల్ల హరికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, కూకట్ పల్లి నియోజకవర్గం అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, తోట శ్రవణ్ కుమార్, కుమార్ తదితరులు పాలొన్నారు.



