Sunday, September 8, 2024

ఎవరికి ఇస్తారో.. ఏంటో

- Advertisement -

నల్గోండ, నవంబర్ (వాయిస్ టుడే): తెలంగాణలో 9 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 3 నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానం తుంగతుర్తితో పాటు సూర్యాపేట, మిర్యాలగూడ సీట్ల అభ్యర్థిత్వాలు ఇంకా కొలిక్కి రాలేదు.తెలంగాణలో కాంగ్రెస్ వామ పక్షాలతో పొత్తు విషయంలో ఇంకా ఎటూ నిర్ణయించు కోలేక పోతోంది. మిర్యాలగూడ సీటును సీపీఎం ఆశిస్తోంది. ఆ పార్టీకి కాంగ్రెస్ కేటాయిస్తామన్న సీట్లలో మిర్యాలగూడ ఒకటి కావడం గమనార్హం.మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం అత్యధిక సంఖ్యలో 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరకు రేసులో బత్తుల లక్ష్మారెడ్డి ఒక్కరే మిగిలినా.. ఆయనకు టికెట్ రాకుండా ఓ సీనియర్ నాయకుడు మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.కాంగ్రెస్, వామపక్షాల పొత్తు విషయం తేలితే కానీ, మిర్యాలగూడ టికెట్ ఎవరికి అన్న విషయం స్పష్టం అయ్యేలా కనిపించడం లేదు. ఒక వేళ ఈ స్థానాన్ని పొత్తులో సీపీఎంకు కేటాయిస్తే.. కాంగ్రెస్ నాయకుడు బీఎల్ఆర్ స్వతంత్రంగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే మరో మారు బీఆర్ఎస్ ఇక్కడి నుంచి గెలవడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికి చేరిన ఆయన 2018 ఎన్నికల్లో పుంజుకుని రెండో స్థానానికి చేరినా, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇపుడు మరో మారు టికెట్ అడుగుతున్నా, ఇంకో నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఉంది.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గరి అనుచరునిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి ఈ సారి వెనక్కి తగ్గేది లేదన్న రీతిలో అధినాయకత్వంపై ఒత్తిడి పెడుతున్నారు. కానీ, పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని ఎలా పక్కన పెట్టాలో అర్థం కాకపోవడం వల్లే పంచాయితీ పరిష్కారం కావడం లేదంటున్నారు.తేల్చలేని కారణంగానే ఈ సీటును పెండింగ్ లో పెట్టారని చెబుతున్నారు. ఒకరికి టికెట్ ఇస్తే రెండో నాయకుడు సహకరించే పరిస్థితులు కనిపంచడంలేదు, అలా అని ఈ ఇద్దరు నాయకుల కాకుండా ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ హై కమాండ్ వేచి చూసే ధోరణిలో ఉందంటున్నారు.ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తిలో కాంగ్రెస్ పదిహేనేళ్లుగా ప్రాతినిధ్యం కోల్పోయింది. జనరల్ స్థానమైన తుంగతుర్తి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీలకు రిజర్వు అయ్యింది. ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు ఆర్.దామోదర్ రెడ్డి సూర్యాపేటకు వసల వెళ్లాల్సి వచ్చింది.ఇక్కడి నుంచి 2009లో టీడీపీ, 2014, 2018ల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలుకాగా, రెండు సార్లు అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈ సారి కూడా ఆయన టికెట్ కోరుతున్నారు. కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా పార్టీలోకి వచ్చిన పిడమర్తి రవి, ఇటీవలో పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు.దీంతో తుంగతుర్తి సీటు విషయంలో కూడా ఏఐసీసీ నాయకత్వం నిర్ణయం తీసుకోలేక పోతోంది. మొత్తంగా మూడు నియోజకవర్గాల్లో నెలకొన్న టికెట్ల పంచాయితీని కాంగ్రెస్ నాయకులు తీర్చలేక పోతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్