- Advertisement -
టచ్ చేసి చూడు…కూటమికి వైసీపీ సవాల్
Touch and see...YCP's challenge to the alliance
తిరుపతి, ఫిబ్రవరి 4, (వాయిస్ టుడే)
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీసీ నాయకుల్లో రోజు రోజుకు ధీమా పెరుగుతుందంట. తమ మీద అరోపణలు చేస్తున్న కూటమి నేతలకు కనీసం కేసులు పెట్టే ధైర్యం లేదని, అనేక అంశాలకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తులు నత్తనడకన సాగుతుండటంతో.. తమను టచ్ చేసే ధైర్యం కూడా వారికి లేదని అంటున్నారంట. వైసీపీ వారిపై టీటీడీ అక్రమాలు, మైనింగ్ దందాలు, పైల్స్ దగ్ధం, భూ అక్రమణలతో పాటు అనేక అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆరంభంలో చూపించిన ఇంట్రస్ట్ తర్వాత చూపించడం లేదు. వాటి దర్యాప్తు పురోగతని కూడా పట్టించుకోవడం లేదు. దాంతో పదేళ్లైనా దర్యాప్తు కొన సాగుతూనే ఉంటుందని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆ ధీమాతోనే అరు నెలలుగా కేసుల భయంతో సైలెంట్ గా ఉన్న వారు ఎదురు దాడి ప్రారంభించారంటున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ టీటీడీలో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఆ దిశగా చర్యలు తీసుకుని..విజిలెన్స్ విచారణకు అదేశించారు. విజిలెన్స్ కూడా గత ఏడు నెలలుగా విచారణ చేస్తుంది. అయితే ఆ విచారణలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. విచారణ నివేదిక ఎప్పుడు వస్తుందో ?దోషులు ఎవరో తేల్చడం లేదు. ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు, శ్రీవాణి నిధులు పక్కదారి, లడ్డూ నాణ్యత లోపాలు, గదుల అక్రమాలు, ప్రమోషన్లలో దందా, కొనుగోళ్లలో అక్రమాలు ఇలా అనేక విషయాలపై విచారణ సాగుతూ నే ఉంది. అయితే ఇప్పటి వరకు గతంలో టీటీడీ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారితో పాటు అప్పటి పాలక మండలిని ప్రశ్నించడం అటుంచి.. కనీసం నోటీసు కూడా ఇవ్వని పరిస్థితి.తర్వాత కొన్ని రోజులకే టీటీడీకి ప్రసాదం తయారీ కోసం సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందనే వాస్తావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా బయటపెట్టారు. దానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం. తర్వాత సుప్రీం కోర్టు ఏంటర్ అయి సీబీఐతో కలిసి జాయింట్ సిట్ ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. వారం రోజుల పాటు సిట్ హాడావుడి కనిపించింది. ఆ విచారణనివేదిక ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతుందని అంటున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో? దోషులెవ్వరో? కొనుగోలుకు సిఫార్సు చేసిన వారు ఎవరు? పాలక మండలి పాత్ర ఎంత? అప్పటి టీటీడీ చైర్మన్ ప్రమేయం? వీటిన్నటిపై సిట్ ఏం నిజం నిగ్గు తేల్చిందో తెలియదు. మొత్తం మీద కల్తీ నెయ్యిపై దర్యాప్తు పూర్తయ్యే లోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దగ్ధం అయిన తర్వాత కుట్ర కోణం బయటపడింది. డీజీపీతో పాటు సిఐడి చీఫ్, రెవెన్యూ ప్రిన్సిపుల్ సెక్రటరీ సిసోడియా మదనపల్లి వచ్చారు. కేసులో కుట్ర కోణం ఉందని నిర్ధారించారు. కర్నూలు డిఐజి వచ్చి కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. అప్పుడు సిసోడియా ఇచ్చిన పిలుపునకు బాధితులంతా బయటకు వచ్చారు. వేలాది మంది తమ భూములను పెద్దిరెడ్డి అండ్ టీమ్ ఎలా కబ్జా చేసిందో బయటపెట్టారు. ఆన్నతాధికారులు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.అనేక మంది తమ పూర్వీకులనుంచి వచ్చిన అస్తులు ఏవిధంగా అన్యాక్రాంతం అయ్యాయో మొర పెట్టుకున్నారు. వేలాది ఎకరాలు కబ్జాకు గురి అయినట్లు వెల్లడై యావత్తు రాష్ట్రం ఆశ్చర్యపోయింది. ఆ క్రమంలో పెద్దిరెడ్డి అనుచరులు మాధవ రెడ్డి, తుకారం లాంటి వారితో పాటు మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి లాంటి వారిపై కేసులు నమోదు అయ్యాయి. తర్వాత కేసు సిఐడికి బదిలీ అయ్యింది. సిఐడి సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ అయిన గౌతమ్ తేజాను అరెస్ట్ చేసింది. తర్వాత అరెస్టులు లేవు, కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియదు. కబ్జాలకు పాల్పడిన వారు మాత్ర ఆ స్థలాలు, భూములను ఏంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు బాధితులు బయటకు వచ్చి చెప్పినందుకు వారిపై వేసీపీ కేడర్ కేసులు పెడుతోందంట.వాటితో పాటు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఏపిక్ కార్డుల కేసు.. చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, తుమ్మలగుంట చెరువు అక్రమించి ఏకంగా స్టేడియం నిర్మాణం, తిరుపతి నగర పాలక సంస్థ ఇష్యూ చేసిన టిడిఅర్ బాండ్స్ ఇష్యూ ,ఎన్నికల సందర్భంగా రేణిగుంట సమీపంలో గొడౌన్ లో సీజ్ చేయబడ్డ ఎన్నికల సామాగ్రి కేసు, చంద్రబాబుపై అంగల్ల వద్ద దాడి కేసు, కుప్పం రెస్కోలో అక్రమ నియామాకాలు, చెరువు ఆక్రమణలు ఇలా చెప్పుకుంటే పోతే వైసీపీ శ్రేణులపై పలు కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో చెప్పుకో దగ్గ అరెస్టు లు కాదు కదా.. కనీసం కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కనీసం కేసులు కూడా పెట్టలేదని కూటమి క్యాడర్ మండి పడుతోంది.అయితే తాజా అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమణల పర్వం వెలుగులోకి రావడంతో దీనిని సీరియస్ గా తీసుకున్నామని చెప్పడానికి సీఎం, డిప్యూటీ సీఎం విచారణకు అదేశించారు, కలెక్టర్, ఎస్పీలను కూడా విచారణ కమిటీలో సభ్యులుగా చేర్చారు. అయితే దీనిపై పెద్దిరెడ్డి మాత్రం చాల వ్యంగంగా మాట్లాడారు. మీరు ఏం చేయలేరు..అరంభంలో చూపించే హడావుడి విచారణలో ఉండదు కదా అన్నట్లు అయన వ్యంగాస్త్రాలు విసిరారు. దాంతో పాటు సీఎం, డిప్యూటీ సీఎంలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసారు. మొత్తం మీద ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.అనేక అరోపణలకు కళ్ళేదుటే సాక్ష్యాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుపోలేక పోతుంది? అధికారులు వీరికి సహాకరించడం లేదా? మరెందుకు కేసుల విచారణలన్నీ నత్త నడకన నడుస్తున్నాయి? గత ప్రభుత్వం సీఐడీని చాలా సమర్ధంగా పార్టీ కోసం వాడుకుంది. కొన్ని సామాజిక వర్గాల వారికి కనీసం సీఐడీలో పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఏపీ డిజిపి చేసిన బదిలీలలో వైసీపీని భుజాన మోసిన కీలక అధికారులకు సిఐడిలో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సిఐడి తో పాటు వివిధ విభాగాలలో పనిచేస్తున్న కీలక అధికారులు ముందుగానే తమ మాజీ బాస్ లకు సమాచారం అందచేస్తున్నారంట. అదే విషయాన్ని వైసీపీ నేతలకు చేరవేస్తూ అలెర్ట్ చేస్తున్నారంట. చంద్రబాబు పోలీసు శాఖ విషయంలో కఠినంగా వ్యవహారించక పోవడంతో ఈ విధంగా విచారణలు నత్తనడకన నడుస్తున్నాయని.. దాంతో ప్రత్యర్థులు మీరేం చేయలేరని ఎదురు దాడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో అనేక దందాలు నడిచినప్పటికి చర్యలు తీసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం కూటమి శ్రేణులకు మింగుడు పడటంలేదంట.
- Advertisement -