- Advertisement -
వైకాపా నేతల గుండెల్లో రైళ్లు
Trains in the hearts of Vaikapa leadersబీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి
గుంటూరు
ఏపీకి మంచి రోజులొచ్చాయని ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ రాక్షసులు మాత్రం బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డ్ నెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వారి బృందం మాత్రం బురదరాజకీయలు చేసి కుటమిపై బురదజల్లుతున్నారు. రాష్ట్రంలో అపర వీరబ్రహ్మేంద్రస్వామి ఒకరు వున్నారు ఆయనే విజయ సాయి రెడ్డి కొత్తగా వైసీపీ కాలజ్ఞానం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. రోజా కూడా పిచ్చాపాటిగా ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తే ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదా అని రోజాని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎడిపించి ప్రజలకు సేవ చేయడం కోసం వస్తానంటూ చెప్పడం చూస్తే విడ్డురంగా ఉంది. ప్రజా కంఠక పాలన సాగించిన జగన్ నీతివ్యాఖ్యలు చేయడం చూస్తే విడ్డురంగా ఉంది. వికసిత ఆంద్రప్రదేశ్ కోసం కూటమి నిధుల వర్షం కురిపిస్తుంటే రాక్షస గణం జగన్మోహన్ బృందం మాత్రం నాశనం చేయాలని చూస్తున్నారు. అమరావతి రైతులు, మహిళలు, కార్మికులు కర్షకులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ మాటలు చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందని అన్నారు. అధికారులను నాశనం చేశావు, రైతులను అణచివేశావు, ప్రజలను సర్వనాశనం చేశావు జగన్. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయకముందే వైసీపీ నేతలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ పై దృష్టి పెడితే ఎక్కడా కనపడని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
గత వైసీపీ హయాంలో జగన్మోహన్ స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయాడు. చంద్రబాబు అద్వరంలో ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. వైసీపీ అధినేత ప్రతిపక్ష హోదా కావాలని కోరడం చూస్తే ప్రజలు చెంప చెళ్లు మనిపించినా ఇంకా సిగ్గురాలేదా అనిపిస్తుందని ఎద్దేవాచేశారు అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతిన్న నేపథ్యంలో పట్టించుకోని జగన్మోహన్ ఇప్పుడు చిలక పలుకులు పలకడం విడ్డురంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా ఎలాంటి ఉపయోగం లేదు, ప్రజలు వెంబడించి కొడతారనేది సత్యం. కావాలి జగన్మోహన్ అన్న ప్రజలు పోవాలి జగన్ అని మొన్న ఎన్నికల్లో చాచి కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి కట్టిబడి ఉంటుందని అన్నారు.
- Advertisement -




