ట్రంప్ ఆర్థిక విధానాల వల్ల అమెరికా మార్కెట్ కుదేలు .
4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి..
Trump's economic policies have caused the US market to collapse, wiping out $4 trillion.
న్యూయార్క్ మార్చి 11 ( వాయిస్ టుడే );: ట్రంప్ ఇచ్చిన షాక్‌తో ఇన్వెస్టర్లు భయపడ్డారు. దీంతో వాళ్లు మార్కెట్ షేర్లను అమ్మేసుకున్నారు. సోమవారం వాల్ స్ట్రీట్‌లో సుమారు నాలుగు ట్రిలియన్ల డాలర్ల నష్టం జరిగింది. యూఎస్ స్టాక్ మార్కెట్లనుంచి 4 ట్రిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. ట్రంప్ ఆర్థిక విధానాల వల్ల మార్కెట్లు షేక్ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాల్ స్ట్రీట్‌కు చెందిన అన్ని ప్రధాన ఇండెక్స్‌లు సోమవారం ట్రేడింగ్‌లో వడిదిడుకులు ఎదుర్కొన్నాయి.డౌ, ఎస్ అండ్ పీ 500, నాక్‌డాక్ మార్కెట్లు .. తీవ్ర వత్తిడికి లోనయ్యాయి. డౌ ఇండెక్స్ ట్రేడింగ్‌లో సుమారు 890 పాయింట్లు తక్కువ వద్ద ముగిసింది. ఇక ఎస్ అండ్ పీ 500.. 2.7 శాతం తక్కువ ట్రేడ్ అయ్యింది. టెకీ కంపెనీలు ఉండే నాస్‌డాక్ 4 శాతం నష్టపోయినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో దేశాధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి అమెరికా మార్కెట్లు డౌన్ అవుతూనే వస్తున్నాయి.