- Advertisement -
యంత్రాలను వినియోగించి, లక్ష్యాలను అధిగమించాలి–ఆర్.జి-3 జి.యం సుధాకర్ రావు.
Use machines and overcome targets--RG-3 GM Sudhakar Rao.
కమాన్ పూర్
యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి భద్రత తో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని సింగరేణి సంస్థ రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అన్నారు.
శుక్రవారం ఓసిపి-1 ఉపరితల గని నందు ట్రాక్టర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కి చెందిన 40 టన్నుల సామర్ధ్యం గల సుమారు 1 కోటి 73 లక్షల విలువ చేసే నూతన క్రేన్ యంత్రాన్ని రామగుండం -3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త యంత్రాలను కొనుగోలు చేయుట కొరకు అనుమతులను మంజూరు చేసిన సంస్థ సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. సంబంధిత ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ యంత్రాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని భద్రత తో కూడిన ఉత్పత్తి నీ అందరము కలసికట్టుగా పనిచేసి సాధించుకోవాలని, యంత్రము లో ఏవైతే రక్షణ పరికరాలు అమర్చి ఉన్నాయో వాటిని అవసరము వచ్చినప్పుడు తూచా తప్పక ఉపయోగించి ప్రమాదాలు జరుగకుండా భద్రత తో పనిచేయాలని యంత్రంలో చిన్న మరమత్తు పని ఉన్నా త్వరగా రిపేరు చేయించుకోవాలని, భద్రత, జాగ్రత్త చర్యలను తూచా తప్పక పాటించాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ సింగరేణి లోనే ఓసిపి-1 ముందు ఉంటుందని, మున్ముందు కూడా ఇలాగే ఉండాలని అన్నారు. అనంతరం బ్రేక్ లో ఉన్న కోమట్సు డంపర్ ను మరమత్తు చేసి అందుబాటులోకి తీసుకు వచ్చి సంస్థ కు సుమారు కోటి రూపాయలు అదాచేసిన ఉద్యోగుల బృందానికి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.
కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్రరెడ్డి, శ్రీనివాసరావు, ఏరియా ఇంజినీర్ వై.వి.శేఖర బాబు, ప్రాజెక్ట్ అధికారి జె.రాజశేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎ.ఉదయ్ భాస్కర్, మేనేజర్ ఉదయ్ హారిజన్, బేస్ వర్క్ షాప్ ఇంఛార్జి జీ.వి.సత్య నారాయణ, పిట్ కార్యదర్శులు డి.టి.రావు, సదానందం, లతో పాటు ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -



