- Advertisement -
వాలంటీర్లు ఉద్యోగం లోనే లేరు–మంత్రి నారా లోకేష్
Volunteers are not on the job--Minister Nara Lokesh
అమరావతి
పుట్టని పిల్లలకు పేరెలా పెడతారని అంటూ వ్యాఖ్యలు
వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లపై ఎదురైన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. పుట్టని పిల్లలకు పేరెలా పెడతారని అంటూ తన వ్యాఖ్యలు ప్రారంభించిన లోకేశ్, వాలంటీర్ల పై జీవో, రెన్యువల్ చేయకపోవడం ఎందుకు అని ప్రశ్నించారు.
వాలంటీర్లపై జగన్ ప్రభుత్వం అనేక అనుమానాలకు తావిచ్చిందని లోకేశ్ విమర్శించారు. వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగించకపోవడమే కాకుండా, ఎన్నికల సమయంలో 80% మందితో రాజీనామా చేయించినట్లుగా కనిపిస్తోంది. దీనిపై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది అని ఆయన ఆరోపించారు.
ఇక వాలంటీర్లకు అధికారిక పోస్టులు లేకపోయినా వారికి డబ్బులు ఇవ్వడం చట్టానికి విరుద్ధమని లోకేశ్ అన్నారు. ‘రెగ్యులర్ ఉద్యోగాల్లో లేకుండా, ప్రభుత్వ ఫండ్స్‌ను ఈ విధంగా ఉపయోగించడం సరైనది కాదు. ఇది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందని మేము భావిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ సమర్థంగా ఉందని జగన్ ప్రభుత్వం అంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం పలు సమస్యలు ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై పూర్తి అవగాహన తీసుకురావాలి. తగిన విధంగా నియమాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు వారిని ఒక అనిశ్చిత పరిస్థితిలో ఉంచడం అన్యాయమని నేను భావిస్తున్నాను అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించాయి. వాలంటీర్ల భవిష్యత్తుపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
- Advertisement -