చెప్పుతో కొట్టినట్టు ప్రజల తీర్పు…
కోమటిరెడ్డికి హరీష్ రావు మద్య మాటల యుద్ధం
హైదరాబాద్ ఫిబ్రవరి 12
: తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండ ప్రజలు బీఆర్ఎస్‌ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారని ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల డిపాజిట్ దక్కించుకోగలిందని విమర్శించారు. అలాంటి పార్టీ నాయకుడు ఏ మొహంతో నల్లగొండలో సభ పెడతారని ప్రశ్నించారు. ‘‘ నల్లగొండ జిల్లా ముందు మా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని వ్యాఖ్యానించారు.కాగా ‘ఆమేథిలో రాహుల్ గాంధీని చెప్పుతో కొట్టారని మేము కూడా అనొచ్చు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. చెప్పుతో కొడతామని అన్న పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి డిలీట్ చేయాలని స్పీకర్‌ను హరీశ్ రావు కోరారు.
కోమటిరెడ్డికి హరీష్ రావు మద్య మాటల యుద్ధం
- Advertisement -
- Advertisement -