వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ బదిలీ…!

- Advertisement -

ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు…

వరంగల్ క్రైం బ్యూరో, అక్టోబర్ 11 (వాయిస్ టుడే ప్రతినిధి) రానున్న తెలంగాణ రాష్ట్ర  శాసన సభ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్  రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది పోలీసు అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో  వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు బదిలీ జరిగింది. రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular