Wednesday, March 11, 2026

హుజురాబాద్ గడ్డమీద గులాబి బొట్టు పెట్టబోతున్నాం

- Advertisement -

మీ కడుపులో తలకాయ పెట్టి అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి
శివాలయం సాక్షిగా చెబుతున్న మాదన్నపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా
ఢిల్లీకి రాజునైన మీ గ్రామాలకు కొడుకుగా ఉంటా
కెసిఆర్ సంక్షేమ పథకాలు తెలంగాణకు శ్రీరామరక్ష
శనిగరాన్ని మండల చేస్తా..

హుజురాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి హుజురాబాద్ గడ్డమీద  గులాబి బొట్టు పెట్టబోతున్నామని ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రచారాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అవ్వలకు బాపులకు దండం పెట్టి మీ కడుపుల తలకాయ పెట్టి మరీ అడుగుతున్న ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని  కౌశిక్ రెడ్డి ప్రజలను వేడుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్, శనిగరం, గూనిపర్తి గ్రామాల్లోఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేను ఢిల్లీకి రాజుగా ఎదిగిన హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు కొడుకుగా ఉంటానని అన్నారు. నన్ను గెలిపించిన వెంటనే శనగరాన్ని మడలంగా చేస్తానని హామీ ఇచ్చారు. కమలాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు కాలేశ్వరం నీళ్లు అందడం లేదని తాను శక్తి వంచన లేకుండా కృషిచేసి ఈ గ్రామాల్లోని ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గత తొమ్మిది సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా కొత్త మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజల కోసం మరికొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ముఖ్యంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని అన్నారు. అంతేకాకుండా రేషన్ మీద ప్రతి కుటుంబానికి సన్న బియ్యం కూడా అందిస్తామన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షలకు పెంచుతామని, ఇంట్లో ఎవరైనా అకార మరణం చెంతే వారికోసం ప్రభుత్వమే కెసిఆర్ బీమా కేసీఆర్ ధీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి 5 లక్షల అందిస్తామని అన్నారు. మాదన్నపేట శివాలయం సాక్షిగా చెబుతున్న హుజురాబాద్ అభివృద్ధి కోసం మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తర్వాత కెసిఆర్ నొప్పించి 1000 కోట్లు తీసుకువచ్చి హుజరాబాద్ తో పాటు మాదన్నపేట, గోపాల్పూర్ లాంటి గ్రామాలను అన్ని రకాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో బీసీ బందు, గృహలక్ష్మి పథకాల కింద ప్రతి ఇంటికి పథకాలన్నింటిని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్