- Advertisement -
మాట ఇచ్చాం.. అమలు చేశాం…
We gave our word... we implemented it...
రైతుల ఖాతాలో జమ అవుతున్న “రైతు భరోసా” అమౌంట్..
రైతు సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట…
ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి
ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడిందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలలో భాగంగా జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేస్తామని పేర్కొన్న రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారమే సోమవారం నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు వస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.బీఆర్ఎస్ చేసిన అప్పుకు సంబంధించి నెల నెల వడ్డీ చెల్లిస్తూనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోపక్క రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుబడి ఉందని ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- Advertisement -