- Advertisement -
ఆర్యవైశ్యుల సంక్షేమానికి పథకాలు రూపొందించాలని ఆదేశించాం
We have ordered to formulate schemes for the welfare of Arya Vaishyas
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కొన్ని పథకాలు రూపొందించాలని సంబంధిత కార్పొరేషన్ను ఆదేశించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ వైశ్యుల సంక్షేమం అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు, ఖర్చు చేసిన నిధుల వివరాలపై ప్రశ్నించగా
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్యవైశ్యుల అభివృద్ధి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని. కార్యాలయం ఏర్పాటు, జీతభత్యాల కోసం 36 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం స్వయం ఉపాధి, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం కొన్ని పథకాలు డిజైన్ చేయాలని ఆదేశించాం అన్నారు. అవి రాగానే నిధులు కేటాయిస్తామని తెలిపారు.
- Advertisement -