- Advertisement -
తగిన సమయం అంటే ఎంత?..స్పీకర్ ను ప్రశ్నించిన సుప్రీం
What is the appropriate time?.. Supreme questioned the Speaker
న్యూ ఢిల్లీ జనవరి 31
పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 10 నెలలు అవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్న బిఆర్ఎస్ తరపున లాయర్ వాదించారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని స్పీకర్ ను సుప్రీం ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా? అని కోర్టు చురకలంటించింది. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెబుతానని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. విచారణ వచ్చే వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
- Advertisement -