9.4 C
New York
Saturday, April 13, 2024

డీప్ ఫేక్‌లపై వాట్సాప్ యుద్ధం..

- Advertisement -

డీప్ ఫేక్‌లపై వాట్సాప్ యుద్ధం.. కొత్త చాట్ బాట్‌తో నియంత్రణకు సిద్ధం..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ అధునాతన సాంకేతిక మనిషిని సైతం రిప్లేస్ చేస్తుందన్న ఆందోళనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీని సాయంతో ఎంత ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. వాటిల్లో ఇటీవల వెలుగుచూస్తున్న డీప్ ఫేక్స్ ఒకటి. ఏఐ ఆధారంగా రూపొందిస్తున్న ఈ డీప్ ఫేక్స్ సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే దీని బారిన అనేకమంది సెలబ్రిటీలు పడ్డారు. లేటెస్ట్ గా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బాధితుల జాబితాలో చేరిపోయారు. డీప్ ఫేక్ సాయంతో ఓ అడ్వర్టైజ్ మెంట్ చేసినట్లుగా చిత్రీకరించారు. ఇది కాస్త వైరల్ గా మారింది. అంతేకాక ఇంకా ఏఐ ఆధారిత నకిలీ సమాచారం చాలా వేగంగా నెట్టింట వైరల్ గా మారతోంది. ఈ క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దీనిని నివారించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌లు ఏఐ రూపొందించిన తప్పుడు సమాచారంతో పోరాడేందుకు త్వరలో ప్రత్యేక వాస్తవ తనిఖీ హెల్ప్‌లైన్‌( ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్) ను ప్రారంభించనుంది. ఈ మేరకు మెటా యాజమాన్యం ఓ కీలక ప్రకటన చేసింది. ఇందుకోసం మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలియన్స్ (ఎంసీఏ) కలిసి మెటా పనిచేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్..

ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్ వచ్చే నెలలో సాధారణ ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఏఐ( కృత్రిమ మేధ)ను ఉపయోగించి రూపొందిన వీడియోలు, మెసేజ్ లను గుర్తిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లోని వ్యక్తులు విశ్వసనీయమైన, ధ్రువీకరించిన సమాచారంతో కనెక్ట్ అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని మెటా తెలిపింది. మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలియన్స్, స్వతంత్ర వాస్తవ-చెకర్లు, పరిశోధనా సంస్థల అనుబంధ నెట్‌వర్క్ మద్దతుతో, ఈ చొరవ, ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగులకు మద్దతిచ్చే ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌కు పంపడం ద్వారా డీప్‌ఫేక్‌లను నియంత్రణకు వీలవుతుందని మెటా యాజమాన్యం ప్రకటించింది.

ఎలా పనిచేస్తుందంటే..

వినియోగదారులు పంపిన సందేశాలు వాస్తవ తనిఖీలు, పరిశ్రమ భాగస్వాములు, డిజిటల్ ల్యాబ్‌లకు ఫార్వార్డ్ అవుతాయని సంస్థ తెలిపింది. వారు కంటెంట్‌ను అంచనా వేసి ధ్రువీకరిస్తారు. సమాచారం నిజమా లేదా కల్పితమైతే డీబంక్ చేస్తారు. మెటా, మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలియన్స్ తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్‌లో “నాలుగు పిల్లర్ అప్రోచ్ ఉంది – డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని గుర్తించడం, నివారించడం, నివేదించడం, వాటిపై అవగాహన కల్పించడంతోపాటు వాటి వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడేందుకు పౌరులు విశ్వసనీయ సమాచారాన్ని పొందేందుకు వీలు కల్పించే కీలకమైన పరికరాన్ని రూపొందిస్తుంది.

11 సంస్థలతో కలిసి..

మెటా చాట్‌బాట్‌లో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలియన్స్ కేంద్ర ‘డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్’ను ఏర్పాటు చేయడంపై పని చేస్తోంది, ఇది హెల్ప్‌లైన్‌లో వారికి వచ్చే అన్ని ఇన్‌కమింగ్ సందేశాలను నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది. ప్లాట్‌ఫారమ్‌లోని తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, ధ్రువీకరించడం, సమీక్షించడం కోసం 11 స్వతంత్ర వాస్తవ-తనిఖీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టెక్ దిగ్గజం తెలిపింది.

నియంత్రణ సాధ్యమేనా..

గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్ ద్వారానే ఏ సమాచారమైన ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందులో తప్పుడు సమాచారం ఎక్కువగా ఉంటోంది. ప్రజలు తరచుగా ఇతరులు పంపిన సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. దీనిని పరిహరించడానికి ఫార్వార్డ్‌లను పరిమితం చేయడం, నకిలీ ఖాతాలను నిష్క్రియం చేయడం వంటి చర్యలను ప్రవేశపెట్టడం ద్వారా మెటా సమస్యను అరికట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే ఈ కొత్త చాట్ బాట్ నకు శ్రీకారం చుడుతోంది. దీని సాయంతో ఏఐ రూపొందించిన ఫేక్ సమాచారాన్ని పూర్తి నియంత్రించాలనేది దీని లక్ష్యం.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!