- Advertisement -
కారును ఢీకొన్న విట్ కాలేజీ బస్సు
Whit College bus collided with a car
భారీగా ట్రాఫిక్ జాం
తాడేపల్లి
తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో కారును విట్ కాలేజీ బస్సు ఢీకొట్టింది. దాంతో అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సోమవారం ఉదయం స్కూల్స్ కి కాలేజీకి ఉద్యోగాలకి వెళ్ళవలసిన వారు ఇబ్బంది పడ్డారు. కాలేజీ బస్సులు మితిమీరిన వేగంతో నడపడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సులకు స్పీడ్ కంట్రోల్ లాక్స్ లేకపోవటంతో మరో కారణం. ప్రతిరోజు ఉండవల్లి సెంటర్ లో ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న సమయంలో ఒక్క పోలీస్ కూడా లేకపోవటం గమనార్ధం. విఐపిలు వస్తున్నారంటే రోడ్డంతా ఆక్రమించి ట్రాఫిక్ అంత క్లియర్ చేసే పోలీసులు పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగస్తుల ఇబ్బందిని పట్టించుకోవడంలేదని స్థానికుల ఆరోపణ.
- Advertisement -