ఈ పాపానికి బాధ్యులు ఎవరు ?
Who is responsible for this sin?
రోడ్డు ప్రమాదంలో ఐదు ఆవులు మృతి
–గంగాపురి సమీపంలో జరిగిన సంఘటన
–అందర్నీ కంటతడి పెట్టించిన వైనం
మంథని
ప్రత్యేక్ష దైవంగా పూజించపడే గోవుల సంరక్షణ విషయంలో ఇటు యజమానులు అటు ప్రభుత్వాలు నిర్లక్షంగా వ్యవహారిస్తుండడం గోవుల పాలిట శాపంగా మారింది. గురువారం తెల్లవారుజామున మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఐదు ఆవులు మృతి చెందాయి.ఈ సంఘటన చూసిన వారందరికీ కంటతడి పెట్టించింది. హృదయాన్ని కలిసి వేసే ఈ సంఘటనకు గో యజమానులు, మున్సిపల్ పాలకులు, వాహనదారుడు ముగ్గురుని బాధ్యులుగా “తలా పాపం తిల పిరికేడు” అన్న చందంగా ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అయ్యో పాపం అనే వారే తప్పితే కఠిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత శాఖలు ముందుకు వెళ్లకపోవడం గో యజమానుల ఆగడాలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ప్రమాదానికి కారణమైన వాహనదారున్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. గోమాతను ఎంతో పవిత్రంగా భావించే (పూజించే) మన దేశంలో గోవులకు ఈ దుస్థితి నెలకొనడం శోచనీయం. గోవులు రోడ్ల పైన అన్నమో రామచంద్రా అంటూ పడిగాపులు గాస్తుండడం అందరినీ కలిచి వేస్తుంది. హోటల్ వద్ద, టీ కొట్టుల వద్ద, ఆసుపత్రుల వద్ద, ప్రయాణ ప్రాంగణాల వద్ద, ఎక్కడ భోజనాలు జరుగుతుంటే అక్కడ నడిరోడ్లపై పచార్లు కొడుతూ గోవులు కాలం వెలదీస్తున్నాయి. గోవుల యజమానులు ఉదయం పాలు పితుక్కుని దర్జాగా బయటికి వదిలి పెడుతున్నారు. వాటి సంరక్షణ పై ఎలాంటి బాధ్యత తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. స్థానిక మున్సిపాలిటీ గ్రామపంచాయతీ వారు గోమాత యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. బజార్ల పై గోవులు కనపడితే వాటిని బంజర్ దొడ్లలకు గాని లేదా గోశాలకు గాని తలిస్తే గో యజమానుల నిర్లక్ష్యాన్ని అరికట్టిన వారవుతారని మున్సిపల్ పాలకులు గ్రహించకపోవడం శోచనీయం. కొందరు మాత్రం గోవులను చేరదీసి వాటికి పౌష్టికాహారాన్ని అందిస్తుండడంతో అవి ఉదయాన్నే యజమాని ఇంటి నుండి సరాసరి వారి ఇంటి వద్దకు వచ్చి పుష్టిగా వారు పెట్టిన పదార్థాలలో ఆరగించి వెళుతున్నాయి. గోవులు ఘోషించిన నాడు మానవుని మొనగాడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నడిరోడ్లపై సంచరిస్తున్న గోవులను కొందరు దుర్మార్గులు వాటిని చంపుకో తినే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గో వద కేంద్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోవులు ప్రకృతికి ఒక వరం లాంటివి. సమాజంలో ఉన్న ధనవంతులు, రాజకీయ నాయకులు, చట్టం, న్యాయవ్యవస్థ వారి వారి పరిధిలో గో సంరక్షణపై త్రికరణ శుద్ధితో పనిచేస్తే గోవులు ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని పూర్తిగా మార్చి వేయవచ్చని గోమాత ప్రేమికుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గో సంరక్షణకై ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా అవి కింది స్థాయిలో అమలు కాకపోవడం స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతుంది. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గో సంరక్షణకై ప్రత్యేక చర్యలు చేపట్టి, గోమాత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రతినిత్యం చట్ట సభల్లో ఎన్నో చట్టాలు తీసుకువస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవుల సంరక్షణకై పగడ్బందీగా కట్టుతిట్టమైన చట్టాలు తీసుకువచ్చి గోవులను రక్షించాలనిప్రజలు కోరుతున్నారు.