Thursday, January 16, 2025

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫి వుందా–మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫి వుందా–మంత్రి పొన్నం ప్రభాకర్

Will farmers' loan be waived off in BJP-ruled states--Minister Ponnam Prabhakar?

హుస్నాబాద్
తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాధాన్యత ఉన్న పథకాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సోమవారం అయన హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 కీ గ్యాస్ అందిస్తున్నాం.  లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాం.40 శాతం డైట్ చార్జీలు పెంచాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిన్న రైతు భరోసా ఇస్తామని ప్రకటించాం  దానిని 12 వేలకు పెంచాం. భూమి లేని పేదలకు సంవత్సరానికి 12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. బీజేపీ,బి ఆర్ఎస్ కలిసి ఒకే ఎజెండా తో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రైతు సంఘం నాయకుడు దల్జీర్ సింగ్  20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు మీ నిర్వహకం వల్లే కదా,  రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారా.? 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశారా. గత ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టడం పెట్టింది. మీరు రైతులకు మద్దతు ధర ఇస్తామన్నారు.
రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఒకే స్వరం తో మాట్లాడుతున్నారు. పిఎం కిసాన్ సమ్మన్ యోజన కింద అప్లై మళ్ళీ చేసు కోవాలా. రైతులకు అవమనిస్తుంది మిరా. మేమా? ఐటీ కడుతున్న వాళ్ళకి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కిసాన్ సమ్మాన్ మీరు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇస్తామన్న ప్రతి హామీ అమలు చేశాం.
ఆర్థిక పరిస్థితుల పై అనేక సందర్భాల్లో శ్వేత పత్రం అడిగాం అప్పుడు ఏనాడు చెప్పలేదు. పైన పటారం లోనా లోటారం అన్న విధంగా వ్యవహరించారు. మీరు ఇచ్చిన హామీల పై ఒకసారి సమీక్ష చేసుకోండి మేము చర్చకు సిద్ధం ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చూస్తున్నారని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుంది. గల్ఫ్ బాధితులకు చరిత్రలో మొదటి సారి 5 లక్షలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో పక్షపాత ప్రభుత్వమే. మేము మాట తప్పమా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. గుట్టలకు రోడ్లు రాళ్ళు వ్యవసాయ యోగ్యం లేని భూములకు రైతు భరోసా ఇవ్వాలని చెప్తుందా బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పాలి. వ్యవసాయ యోగ్యమైన భూమికి సంవత్సరానికి 12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం యూపీఏ ప్రభుత్వంలో 72 వేల కోట్ల రుణమాఫీ చేశాం నరేంద్ర మోడీ డ్రెస్సింగ్ మీద తప్ప దేశం కోసం ఏం నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కి రైతుల మీద ప్రేముంటే మేము ఇస్తున్న రైతు భరోసా కి మీరు 12 వేలు జమ చేయండి. తెలంగాణ నూతన రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తారో చెప్పండి.  రైతుల సంక్షేమానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం.
మేము రైతుల కోసం చేస్తున్న సన్న వడ్లకు 500 బోనస్ భూమి లేని పేదలకు 12 వేలు రైతు రుణమాఫీ మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేశారా అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్