Monday, October 14, 2024

సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం

- Advertisement -

సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం

With the verdict of the Supreme Court... there is chaos in YCP

న్యూఢిల్లీ, అక్టోబరు 1, (వాయిస్ టుడే)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సప్రీంకోర్టుకు చేరింది. సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సిట్ నియమించారు. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నైతిక బలాన్ని ఇచ్చాయి.ఇప్పటి వరకూ తమ వాదన ఎలా చెప్పుకోవాలో వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే ఆధారాలేవని ప్రశ్నించిందని.. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నట్లుగా వ్యాఖ్యానించడంతో వైసీపీ కాస్త రిలీఫ్ ఫీలయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన  వ్యాఖ్యలను బట్టి చూస్తే..దర్యాప్తు సీబీఐ లేదా మరో కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ సిట్ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. గురువారం తదుపరి విచారణలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున కొనసాగించి..  నివేదిక ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావొచ్చని చెప్పవచ్చని కొంత మంది న్యాయనిపుణలు చెబతున్నారు. ఒక వేళ అసలు ఏపీ ప్రభుత్వాధినేత ముందుగానే చెప్పారు కాబట్టి సిట్ దర్యాప్తుపై నమ్మకం ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిఫారసు చేయవచ్చు. పిటిషనర్ కోరినట్లుగా తామే దర్యాప్తును పర్యవేక్షిస్తామని చెప్పడం అసాధారణం. ఒక వేళ అలా చెప్పినా దర్యాప్తు అధికారులు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు చెందిన వారే ఉంటారు. అందుకే దర్యాప్తు చేసేది ఎవరైనా పెద్దగా తేడా ఉండదని కొంత మంది భావన.తిరుమలలో జరిగిన లడ్డూ నెయ్యి టెండర్ల విషయంలో భారీ గోల్ మాల్ జరిగిందని ఇప్పటికే ఆధారాలు బయటకు వచ్చాయి. ఏఆర్ డెయిరీకి నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా టెండర్ నిబంధనలు సవరించి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే నెయ్యి కూడా ఏఆర్ డెయిరీ నుంచి రావడం లేదు.. దగ్గర్లోని శ్రావణి డెయిరీ అనే సంస్థ నుంచి వస్తున్నాయని కూడా వస్తున్నయని గుర్తించారు. అలాగే నెయ్యిని సరైన టెస్టులు చేయకుండానే లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఇప్పటికే సిట్ అధికారులు వీటన్నింటిపై పరిశీలన జరిపారు. అధికారుల నుంచి అన్ని వివరాలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున టీటీడీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క టీటీడీ చైర్మన్ మూడున్నర లక్షల టిక్కెట్లు తన కోటాలో మంజూరు చేశారుని.. రోజా, పెద్దిరెడ్డి వేల కొద్దీ టిక్కెట్లు తీసుకుని అమ్ముకున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఒక వేళ నెయ్యి కల్తీ కేసులో తీగ లాగితే..ఈ మొత్తం వ్యవహారాలు బయటకు వస్తే అధికారికంగా బయట పెడితే కేసులు అయ్యే సంగతేమో కానీ.. మందు హిందూ భక్తుల్లో వైఎస్ఆర్‌సీపీకి మరింత మైనస్ అవుతుంది. అందుకే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనే అంతా అయిపోలేదని ముందు ముందు చాలా కథ ఉందని టీడీపీ నేతలంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్