ప్రతీ కుటుంబానికి మహిళే వెన్నేముక
Women are the backbone of every family
తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి
జగిత్యాల,
జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యాలను ఎదుర్కొన్న సమస్యలని తాము సాధించిన విజయాలను సాధించుకోవడనికి ఒక వేదిక ఉపయోగపడుతుందని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి -లక్ష్మణ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని విరుపక్షీ గార్డెన్స్ లో ఆడవారికి ఆదివారం సెలవు కార్యక్రమాన్ని జగిత్యాల సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై మాట్లాడుతూ..ప్రతీ కుటుంబానికి మహిళే వెన్నేముక. మహిళా మణులు వారి కుటుంబాలకు చేదోడు వాడోడుగా నిలబడటానికి వారిని బలోపేతం చేయడానికి నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తున్నాను
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని , సమాజంలో మార్పు రావాలంటే మహిళలు ఒక ప్రణాళికా బద్దమైన కార్యచరణతో ముందుకెళ్లాలన్నారు.ప్రతీ నిమిషం స్త్రీని గౌరవించినప్పుడే నవ సమాజం రూపం దాలుస్తుంది. మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఉద్యోగిగా బహుముఖ పాత్రలు పోషిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యం, శృతి, జబర్దస్త్ వినోదిని, నరేష్, శ్రీనివాస్, రామకృష్ణ, గుండేటి రాజు, సత్యం, శశి, ఉషారాణి, రేణుక, కోటగిరి మంగ, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.