- Advertisement -
నాక్ అక్రిడేటెడ్ కోసం తప్పు దారులు
Wrong ways for Knock Accredited
హైదరాబాద్, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే)
గుంటూరులో సిబిఐ అధికారులు మెరుపు దాడికి దిగారు. కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నాక్ రేటింగ్ ఇచ్చే విషయంలో లక్షలాది రూపాయల ముడుపులు చేతులు మారాయి అన్న ఆరోపణలపై ఈ తనిఖీలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగినట్లు తెలుస్తోంది. సాధారణంగా విద్యాసంస్థలకు నాక్ గుర్తింపు ఇస్తారు. కొన్ని ప్రైవేటు కాలేజీలకు నాక్ మెరుగైన రేటింగ్స్ ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే కేఎల్ యూనివర్సిటీలో సిబిఐ అధికారుల బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. అయితే ఈ ఆరోపణలు నిజమని తేలడంతో వైస్ ఛాన్సలర్ జీవి సారధి వర్మను అరెస్టు చేశారు. అయితే ముడుపులు తీసుకున్న వారిలో నాక్ టీం సభ్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.అయితే ఒక్క గుంటూరు కాదు.. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇందుకోసం 15 బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గుంటూరు వడ్డేశ్వరంలో ఉంది కేఎల్ యూనివర్సిటీ.A++నాక్ అక్రిడేటింగ్ రేటింగ్ కోసం కేఎల్ యూనివర్సిటీ భారీగా నగదు ముట్ట చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడం.. విచారణలో సాక్షాలు దొరకడంతో రెడ్ హ్యాండెడ్ గా వైస్ ఛాన్స్ లర్ ను అరెస్ట్ చేశారు.నాక్ రేటింగ్ గుట్టు రట్టు చేశారు. అయితే వీసీ తో పాటు మరో పదిమందిని సైతం అరెస్టు చేయడం విశేషం. యూనివర్సిటీకి అనుకూలంగా రేటింగ్ ఇవ్వాలని భారీగా ముడుపులు చెల్లించినట్లు సాక్షాలతో సహా తేలింది. ఏకంగా నాక్ టీంకు లంచం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు.గుంటూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్ వంటి 20చోట్ల ఏకకాలంలో 15 సీబీఐ బృందాలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. అక్రిడేటింగ్ వెయిటింగ్ కోసం ఇచ్చిన నగదు, బంగారం, లాప్టాప్ లు, సెల్ఫోన్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 37 లక్షల రూపాయల నగదు, విలువైన సెల్ఫోన్లు వంటివి పట్టుబడ్డాయి.నాక్ అక్రిడేటింగ్ రేటింగ్ నకు సంబంధించి దేశవ్యాప్తంగా భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సిబిఐ స్పందించింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కదలికలపై నిఘా పెట్టింది. అటు అక్రిడేటింగ్ ఇచ్చే నాక్ టీం పై సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలోనే దేశవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో.. భారీగా ముడుపులు అందించేందుకు విద్యాసంస్థలు సిద్ధపడినట్లు తేలింది. మొత్తానికైతే గుంటూరులో సిబిఐ దాడులు సంచలనం కలిగించాయి.
- Advertisement -