యానాం ఉత్సవాలు ప్రారంభం
Yanam festival begins
మల్లాడి, గొల్లపల్లికి మధ్య మాటల యుద్దం
యానాం
యానాం ప్రజాఉత్సవాలు, ఫల పుష్ప ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు కొనసాగుతాయి.. తొలిరోజు ముఖ్య అతిధిలుగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామితో పాటుగా, స్పీకర్, పలుశాఖల మంత్రులు, పుదుచ్చేరికి చెందిన ఎమ్.ఎల్.ఏలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికపై ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు.. నేను పదహారు గంటలు రోడ్డు ప్రయాణం చేసి యానాం వచ్చాను, యానాం ప్రజలకొరకు ఎంత కష్టానైనా భరిస్తానని రంగస్వామి అన్నారు.. ఈ సభా వేదికపై మల్లాడి కృష్ణారావు, ఎమ్.ఎల్.ఎ గొల్లపల్లి అశోక్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.. ఎమ్.ఎల్.ఎ గొల్లపల్లి అశోక్ మాట్లాడుతూ..
నేను ఈ ఉత్సవాలకు రావడం మొదటిసారి. గత ఉత్సవాల సమయంలో నేను యానాం ప్రజలకొరకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాను. ఇక్కడ పది నిమిషాలలో పది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, చాలా మంచివిషయం, కానీ స్దానిక ఎమ్.ఎల్.ఎ కు చెప్పి చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి అవి పరిగణలోకి తీసుకోండి అంటూ..యానాంలో జరుగుతున్న చిత్రవిచిత్రాలను చూసి నేను మరింత ముందుకు వెళ్లాలని బలంగా నిశ్చయించుకున్నానని తన అక్రోశం వెళ్లగక్కారు..
మంత్రులు, తోటి శాసనసభతో పాటుగా మల్లాడి తనకు కూడా శాలువా కప్పుతుంటే అశోక్ తిరస్కరించి పక్కన పడవేసారు. జ్ణాపికను తీసుకున్నారు. కార్యక్రమం ఆద్యంతం ముభావంగా ఒక ప్రక్కన కూర్చుని ఉండిపోయారు.. ఇక సభా వేదికపై మల్లాడి తగ్గేదేలే, తగ్గేదేలే అంటూ పుష్పా హీరో స్టయిల్ లో చెలరేగిపోయారు..
నేను యానాం ప్రజలకొరకు ఏదైనా సాధించాలి అనుకుంటే నిరాహారదీక్ష చెయ్యవలసిన అవసరంలేదు. నిరాహారదీక్షలు చెయ్యడం వల్ల బిపి డౌన్ అవుతుంది కానీ పనులు జరగవు అంటూ ఎమ్.ఎల్.ఎ అశోక్ కు కౌంటర్ వేసారు..హెచ్.ఆర్ స్క్వేర్ అనే బినామీ సంస్దను స్థాపించి పారిశుధ్య పనులలో కోట్లరూపాయలు కొల్లగొడుతున్నది ఎవరో తెలుసు, అక్రమంగా తిన్న ప్రజల సొమ్మును కక్కిస్తాను అంటూ సవాల్ చేసారు..యానాంలో పేకాట క్లబ్బుల సంస్కృతి తెచ్చింది ఎవరో తెలుసు, ఈ క్లబ్బులను మూయించాను, అయినా ఒకటి రెండు క్లబ్బులు అక్రమంగా నడుస్తున్నాయి. ఈ క్లబ్బులనుండి ఒక ప్రజాప్రతినిధికి నలభై శాతం వాటా వెళుతుంది ఇది నిజంకాదా అంటూ మల్లాడి పరోక్షంగా అశోక్ ను నిలదీసారు..పాండిచ్చేరి పాలిత ప్రాంతాలలో పేకాట క్లబ్బులు లేకుండా చేసేందుకు అసెంబ్లీలో చట్టం రూపొందిస్తున్నాం, దీనికి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, శాసనసభ్యుల మద్దతు ఉంది రాబోవు కాలంలో ఈ చట్టం రూపుదిద్దుకుంటుందని మల్లాడి అన్నారు..
ఎమ్.ఎల్.ఎ ఈరోజు ఒకడు ఉంటే రేపు ఇంకొకడు ఉంటాడు, ఎవడు ఉన్నా లేకపోయినా, నేను మాత్రం యానాం ప్రజలకొరకు ఉంటాను తగ్గేదేలే, తగ్గేదేలే అంటూ పుష్ప హీరో లాగా పంచ్ డైలాగ్ వేసారు..ఈ ఉత్సవాలులో పలు రాష్ట్రాలనుండి వచ్చిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి..ఫలపుష్ప ప్రదర్శన చూసేందుకు యానాం పరిసర ప్రజలు భారీగా తరలివచ్చారు.