- Advertisement -
బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడి
Youth Congress leaders attacked BJP office
టీపీసీసీ సీరియస్
టీపీసీసీ
హైదరాబాద్
బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిపై టీపీసీసీ సీరియస్ అయింది. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన ఉండాలి.. ప్రియాంక గాంధీ పై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే . కానీ యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. యూత్ నేతలకు అయన వార్నింగ్ ఇచ్చారు. యూత్ నేతలను పిలిచి మందలించనున్నారని సమాచారం. బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదు.. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యం లో దాడులు పద్ధతి కాదు..
శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలని అయన అన్నారు.
- Advertisement -