కూకట్ పల్లి :నవంబర్ 23(వాయిస్ టుడే): కెపిహెచ్బి 114 డివిజన్ ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గా పోటీ చేసిన ఉంగరాల వెంకట నాయుడు కెపిహెచ్బి ఐదవ ఫేజ్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అంటే ఒక పద్ధతి క్రమశిక్షణ గల పార్టీ, యువత ఈ రోజు పార్టీ లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు జనసేన గెలుపుదిశగా ప్రచారాలు నిర్వహించి భారీ మెజారిటీ తో గెలిపించాలని అన్నారు. అనంతరం యువ కెరటం ఉంగరాల వెంకట నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ లో చేరడం జరిగిందని అన్నారు. ఈ బిఆర్ఎస్ పార్టీ చేసే అక్రమలు, అన్యాయాలను అణచివేయాలంటే జనం మెచ్చే జనసేన పార్టీ రావాలని, ప్రజల్లో మార్పు రావాలి అనే ఒకటి సిద్ధం తోటి నమ్మి పార్టీలో చేరడం జరిగింది. రేపు జనసేన పార్టీ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చే మనిషి మన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాత్రమే అని, వారిని గెలిపించే దిశగా నేను పనిచేస్తానని అన్నారు. జనసేన పార్టీ నమ్మి టికెట్ ఇచ్చినందుకు మోడీ ని మరియు తెలంగాణ రాష్ట్ర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. కూకట్పల్లిలో జనసేన ను గెలిపించి మోడీ కి జనసేన విశ్వాసం తెలియజేస్తామని, అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు.




