అప్ని హద్ద్ సే’ చిత్రంలోని ‘తేరా హీ కరమ్’ పాటకు విజయం

- Advertisement -

అప్ని హద్ద్ సే’ చిత్రంలోని ‘తేరా హీ కరమ్’ పాటకు విజయం

Success for the song ‘Tera Hi Karam’ from the film ‘Apni Hadd Se’.
‘అప్ని హద్ద్ సే’ చిత్రంలోని  పాటకు లభిస్తున్న విశేష స్పందనను చిత్ర హీరో నజీర్ సినిమా మరియు సాంగ్ విశేషాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘తేరా హీ కరమ్ తేరా సహారా చాహియే’ అనే పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 3 మిలియన్ల రీచ్‌తో మొదలైన ఈ పాట, ప్రస్తుతం ప్రేక్షకుల అమితమైన ఆదరణతో ఏకంగా 6 మిలియన్   మైలురాయిని చేరువలో ఉంది . ఈ పాట సోషల్ మీడియాలోనూ, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంటూ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ జమీర్ షేక్ మాట్లాడుతూ, పాట నిర్మాణంలోని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ: “ఒక పాటను ఎడిట్ చేయడంలో భావోద్వేగమే ప్రధానమైనది. సంగీతానికి మరియు లిరిక్స్‌కు తగినట్లుగా విజువల్స్‌ను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేయడానికి నేను మూడు వేర్వేరు వెర్షన్‌లపై పనిచేశాను. గీత రచయిత నజీర్ గారి సాహిత్యం, నటీనటుల అభినయం, మరియు మా టీమ్ సమన్వయం వల్లే ఈ పాట ఇంతటి ఘనవిజయాన్ని అందుకుంది. ఈ గొప్ప అవకాశం కల్పించిన ‘లూమినస్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ (Luminous Entertainments) వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు,” అని తెలిపారు.  ప్రేక్షకులు తమ పాటకు అందిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాట సాగుతున్న వేగం చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular