తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి
అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 5
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ప్రకటించారు.తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారని వెల్లడించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపే తీర్మానం మొదటిది కాగా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలుపేది రెండో తీర్మానమన్నారు. ఇక మూడోది అతి ముఖ్యమైనది సీఎల్పీ నేత ఎంపికను అధిష్ఠానానికే వదిలేస్తూ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ఆమోదించారని కేసీ వేణుగోపాల్ వివరించారు. రిపోర్ట్ పరిశీలించిన తర్వాత సీనియర్లతో చర్చించామని, రేవంత్‌ని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
- Advertisement -
- Advertisement -



