- Advertisement -
ఖమ్మం జిల్లా :అక్టోబర్ 12: తోడబుట్టిన అన్నను.. సొంత తమ్ముడే కడతేర్చిన ఘటన ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వెంకటగిరి గ్రామానికి చెందిన కారేపొంగు రాజేష్, తమ్ముడు నవీన్ మధ్య బుధవారం రాత్రి ఆర్ధిక లావాదేవీల్లో తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ ఘర్షణలో తమ్ముడు నవీన్ బీరు సీసాతో రాజేష్ గొంతులో పొడిచి అతి కిరతకంగా హత్య చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజేష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ మేరకు ఘటనా స్థలాన్ని చేరకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
- Advertisement -