Tuesday, April 7, 2026

‘హను-మాన్’ నుంచి సూపర్ హీరో హనుమాన్ పాట విడుదల

- Advertisement -

సూపర్ ఆంథమ్‌తో సూపర్ హీరో ల్యాండ్స్- ప్రశాంత్ వర్మ

సూపర్‌ హీరో సినిమాల ఇండియన్ ఫ్యాన్స్ మన సూపర్‌హీరో హను-మాన్‌ని తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. తేజ సజ్జ లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ‘హను-మాన్ ‘ సాహసాలను దాదాపు రెండు నెలల్లో చూడబోతున్నారు ప్రేక్షకులు. యూనిక్ కాన్సెప్ట్‌లతో ఒరిజినల్ సినిమాలు తీయడమే కాకుండా ప్రమోషన్స్‌లోనూ తనదైన ప్రత్యేకతను చాటారు ప్రశాంత్ వర్మ. టీజర్, హనుమాన్ చాలీసా పాటకు అద్భుతమైన స్పందన రావడంతో దర్శకుడు, హను-మాన్ టీమ్ మరింత కేర్ తీసుకుంటున్నారు.
సెకండ్ సింగిల్ సూపర్‌హీరో హనుమాన్‌ని లాంచ్ చేయడానికి టీమ్ చిల్డ్రన్స్ డే సందర్భాన్ని ఎందుకు ఎంచుకుందని చాలా మంది ఆశ్చర్యపోయారు. పాట చూసిన తర్వాత అందరికీ ఇదే విషయంపై క్లారిటీ వస్తుంది. సూపర్‌హీరో హనుమాన్ ఫన్నీ, అదే సమయంలో అడ్వెంచర్స్. ఈ పాట కోసం అనుదీప్ దేవ్ పెక్యులర్ నెంబర్ ని కంపోజ్ చేశారు. వాగ్దేవి, ప్రకృతి, మయూఖ్ హ్యుమరస్ గా అలపించారు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం కంప్లీట్ కామికల్ గా ఆకట్టుకుంది. ఒరిజినల్ విజువల్స్‌తో కామికల్ నెరేషన్ పిల్లలను ఆకర్షించింది. నిజానికి, పిల్లలు మన సూపర్ హీరో హనుమంతు సూపర్ పవర్‌లను చూడటానికి ఇష్టపడతారు. ఈ సూపర్ ఆంథమ్‌ ఇన్స్టెంట్ హిట్, ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం బెస్ట్ ప్రజంటేషన్.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను-మాన్. హను-మాన్ “అంజనాద్రి” ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్